Police complaint: వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar)పరిచయం అవసరం లేని పేరు శరత్ కుమార్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె కెరియర్ మొదట్లో హీరోయిన్గా పలు సినిమాలలో నటించారు. హీరోయిన్ గా ఈ సినిమాలు ఈమెకు పెద్దగా పేరు ప్రఖ్యాతలను తెచ్చి పెట్టలేదు. దీంతో నెగిటివ్ పాత్రల (Negative Roles)ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా వరలక్ష్మి శరత్ కుమార్ లేడీ విలన్ పాత్రలలో అదరగొడుతూ వరుస తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించే అవకాశాలను అందుకుంటున్నారు.. ఇక పెళ్లి తర్వాత కూడా ఈమె వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పట్ల బిజీ అయ్యారు.
హర్రర్ థ్రిల్లర్ గా పోలీస్ కంప్లైంట్…
ఇకపోతే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్న “పోలీస్ కంప్లైంట్” (Police Complaint)చిత్రం నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. పోలీస్ ఆఫీసర్ డ్రెస్ లో వరలక్ష్మిను చూస్తుంటే ఈమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. ఇకపోతే ఈ పోస్టర్ ను సూపర్ స్టార్ కృష్ణ(Super Star Krishna) పుట్టినరోజున పురస్కరించుకొని విడుదల చేయటం విశేషం. హర్రర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో ప్రత్యేకంగా సూపర్ స్టార్ కృష్ణ మీద ఒక స్పెషల్ సాంగ్ చేశారు. ఈ సాంగ్ సినిమాకి హైలైట్ గా ఉండబోతుందని తెలుస్తుంది.
సూపర్ స్టార్ కృష్ణ పై సాంగ్…
ఇలా సూపర్ స్టార్ కృష్ణ మీద ఒక పాట ఉన్న నేపథ్యంలోనే ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఈ సినిమా నుంచి వరలక్ష్మి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ చిత్రాన్ని ఎమ్మెస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్, శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించగా, శ్రీ హర్ష, నవీన్ చంద్ర, రాజశ్రీ నాయర్,కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ పోస్టర్ విడుదల సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని ఈ సినిమా సరికొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.
ఇక ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతుందని తెలిపారు. ఇక ఈ సినిమాకు సూపర్ స్టార్ కృష్ణ గారి మీద చేసిన పాట సినిమాకే హైలెట్ అవుతుందని , ఈ పాట ప్రతి ఒక్కరికి ఎప్పటికీ గుర్తుంది పోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా యాక్షన్ హర్రర్ డ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేలవింపుగా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుందని నిర్మాతలు తెలియచేశారు. మరి పోలీసు ఆఫీసర్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ తన నటన ద్వారా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.