KCR – HarishRao : మామ, అల్లుడు తెగ మంతనాలు చేస్తున్నారు. ఎప్పుడూ లేనిది పదే పదే ఫాంహౌజ్‌కు వెళ్తున్నారు హరీశ్‌రావు. ఇప్పటికే మూడుసార్లు కలిశారు. శుక్రవారం సుమారు మూడున్నర గంటల పాటు ఇద్దరూ చర్చలు జరిపారు. కవిత లొల్లిపై మాట్లాడారా? కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చించారా? కేటీఆర్ అమెరికాలో ఉన్న టైమ్‌లో కేసీఆర్, హరీశ్‌ల భేటీ కీలకంగా మారింది. కవితకు షోకాజ్ నోటీసులు ఇస్తారా? పార్టీ నుంచి పంపించేస్తారా? పిలిచి బుజ్జగిస్తారా? అనే దానిపై క్లారిటీ లేదు.
కలవరం పెరిగిందా?
తెలంగాణ చాణక్యుడు కేసీఆర్, ట్రబుల్ షూటర్ హరీశ్‌రావులు ఇద్దరూ కలిసి.. కాళేశ్వరం కేసు నుంచి ఎలా బయటపడాలా? అని వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే ఆ కేసు ఉచ్చు గట్టిగానే బిగుసుకుంది మరి. జూన్ 5న కేసీఆర్ విచారణకు రావాల్సి ఉంది. జూన్ 9న హరీశ్‌రావు వంతు. అందుకే ఆ ఇద్దరిలో కంగారు పెరిగిందని అంటున్నారు.
ఎల్ అండ్ టీ లేఖనే ఆయుధమా?
కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణపై హరీశ్‌తో కేసీఆర్ సమీక్షించినట్టు తెలుస్తోంది. విచారణలో వినిపించాల్సిన వాదనలు, వివరణలపై ఆ ఇద్దరూ చర్చించారట. కాళేశ్వరంపై NDSA ఇచ్చిన రిపోర్టును ప్రాజెక్టును నిర్మించిన L&T సంస్థ తప్పుబడుతూ ఇటీవలే లేఖ రిలీజ్ చేసింది. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా బ్యారేజీపై రిపోర్ట్ ఎలా ఇస్తారన్న ఎల్ అండ్ టీ వాదననే తాము కూడా కమిషన్ ముందు ప్రస్తావించాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రాజెక్టు శంకుస్థాపన నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు జరిగిన ప్రక్రియనంతా వివరించేందుకు.. వీలుగా తగినంత సమయం ఇవ్వాలని కమిషన్‌ను కేసీఆర్ కోరనున్నట్టు తెలుస్తోంది.
కమిషన్ ఖతర్నాక్ ఎంక్వైరీ
కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే విచారణను దాదాపు పూర్తి చేసింది. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని కమిషన్ సుమారు 400 పేజీలతో కూడిన నివేదిక రెడీ అయింది. కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ల విచారణ తర్వాత ఎంక్వైరీ ముగించబోతోంది. మే చివరి వారంతో కమిషన్ గడువు ముగియాల్సి ఉండగా.. మరో రెండు నెలలు పొడగించింది ప్రభుత్వం. ఆధారాలన్నీ రెడీగా ఉన్నాయి. 100 మందికి పైగా అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి అఫిడవిట్లు ముందుగానే సేకరించారు. నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, హైడ్రాలజీ నిపుణులు, CAG అధికారులను విచారించారు. విజిలెన్స్, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదికలను పరిశీలించారు. కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా సాక్ష్యాలను లోతుగా పరిశీలించింది. ఇంజనీర్లు, IAS అధికారులు, మాజీ ENCలు, చీఫ్ ఇంజనీర్లను ప్రశ్నించారు. బ్యారేజీల స్థల ఎంపిక, డిజైన్ మార్పులు, నిర్మాణ హడావుడి వంటి అంశాలపై కంప్లీట్ మేటర్ సేకరించింది కమిషన్.
కేసీఆర్ గెట్ రెడీ..
ఇంత పకడ్బందీగా వ్యవహారం నడిపిన కమిషన్.. ఇప్పుడు కేసీఆర్ కు సంధించబోయే ప్రశ్నల విషయంలో ఇంకెంత అలర్ట్ గా ఉంటుందో చెప్పనవసరం లేదు. కమిషన్ కేసీఆర్ ముందుంచే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏంటి? వాటికి మాజీ సీఎం జవాబులు ఎలా ఉండబోతున్నాయ్ అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. క్వశ్చన్ టు ఆన్సర్ రెడీ చేసుకుంటున్నారు కేసీఆర్. అందుకే ఎర్రవెల్లి ఫాంహౌజ్ లో మాజీ మంత్రి హరీష్ రావుతో విడతల వారీగా భేటీ అవుతున్నారు. ఏం చెప్పాలి.. ఎలా కౌంటర్ ఇవ్వాలి. ఎలా డిఫెండ్ చేసుకోవాలి.. ఎలా జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి.. ప్రాజెక్టు ఎలా ఉపయోగపడిందో చెప్పాలి.. ఇలాంటివన్నీ హైలెట్ చేసేందుకు రెడీ అవుతున్నారు కేసీఆర్.