BigTV English

Train Ticket Booking: ట్రైన్ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్‌ చేస్తున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Train Ticket Booking: ట్రైన్ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్‌ చేస్తున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Indian Railways: ప్యాసెంజర్లకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఎప్పటికప్పుడు సరికొత్త నిబంధనలు అందుబాటులోకి తీసుకొస్తున్నది. అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ బుకింగ్స్ కు సంబంధించి గత ఏడాది నవంబర్ నుంచి కొత్త రూల్స్ ను అమలు చేస్తున్నది. అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వాళ్లు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


ఎందుకు అడ్వాన్స్ రిజర్వేషన్ టైమ్ తగ్గించారంటే?

అడ్వాన్స్ టికెట్ బుకింగ్ వ్యవధి 120 రోజుల ఉన్న నేపథ్యంలో ప్రయాణ సమయానికి చాలా మంది టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇలా క్యాన్సిల్ చేసే వారి సంఖ్య ఏకంగా 21 శాతం ఉన్నట్లు రైల్వే అధికారులు గుర్తించారు.  అటు టికెట్ బుక్ చేసుకున్న వారిలో సుమారు 5 శాతం మంది ప్రయాణం చేయట్లేదని తేలింది. వీరి కారణంగా అత్యంత ప్రయాణాలు చేయాల్సిన వారికి ఇబ్బంది కలుగుతున్నది. ఈ నేపథ్యంలోనే అడ్వాన్స్ రిజర్వేషన్ గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు కుదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.  అయితే, ఈ రూల్స్ నుంచి కొంత మంది ప్రయాణీకులతో పాటు కొన్ని రైళ్లకు మినహాయింపు ఇస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ మినహాయింపులు ఎందుకు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకునే వాళ్లకు తెలియాల్సిన కీలక విషయాలు

⦿ భారతీయ రైల్వే సంస్థ తీసుకొచ్చిన అడ్వాన్స్ రిజర్వేషన్ రూల్స్ విదేశీ ప్రయాణికులకు వర్తించవు. వారు ప్రయాణానికి ఏడాది ముందే అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది.

⦿ తాజ్ ఎక్స్‌ ప్రెస్, గోమతి ఎక్స్‌ ప్రెస్ లాంటి పగటిపూట ప్రయాణించే ఎక్స్ ప్రెస్ రైళ్లకు సైతం 60 రోజుల నిబంధన వర్తించదు. ఈ రైళ్లకు  సంబంధించిన టికెట్లను 120 రోజుల ముందే బుక్ చేసుకునే అవకాశం ఉంది.

Read Also: చర్లపల్లి నుంచి మరిన్ని MMTS రైళ్లు, ప్రయాణీకులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్

⦿ మిగతా అన్ని రైళ్లలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కు సంబంధించిన కొత్త నిబంధనలు అమల్లో ఉంటాయని వెల్లడించింది.

⦿ 1995-98  మధ్య కాలంలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ టైమ్ 30 రోజులు ఉండేది. ఆ తర్వాత చాలా సార్లు మార్పులు చేశారు. తాజాగా 60 రోజులకు రిజర్వేషన్ సమయాన్ని కుదిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్నది.

Read Also: తెలియని వ్యక్తులకు టికెట్లు బుక్ చేస్తున్నారా? జైల్లో ఊచలు లెక్కబెట్టడం ఖాయం!

⦿ అటు పరిమితికి మించి లగేజీ తీసుకురాకూడదని రైల్వేశాఖ వెల్లడించింది.

⦿ ఏ క్లాస్ లో ప్రయాణించే ప్రయాణీకులు ఆయా క్లాస్ కు అనుమతించే మేరకు మాత్రమే లగేజీ తీసుకురావాలని సూచించింది. పరిమితికి మించి తీసుకొస్తే జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది.

ప్రయాణీకులు ఎవరైనా రైల్వే నియమ నిబంధనలకు లోబడి ప్రయాణించాల్సి ఉంటుందని రైల్వేశాఖ తేల్చి చెప్పింది. రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Read Also: కుంభమేళాకు వెళ్లే తెలుగు భక్తులకు గుడ్ న్యూస్, ఆ రెండు రైళ్లకు బోగీల పెంపు!

Related News

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Big Stories

×