Gold Rate Today: మహిళలకు ఎంతో ఇష్టమైంది బంగారం.. అసలే పెళ్లిళ్ల సీజన్.. ఉగాది తర్వాతా పెళ్లిళ్లు, శుభకార్యాలు మరింత పెరుగుతాయి. మన దేశంలో సాధారణంగా వివాహాలు, ఫంక్షన్స్, పండుగలు అంటే మొదటగా గుర్తొచ్చేది బంగారమే. బంగారం లేకుండా ఏ పెళ్లి జరగదు. అయితే ఈ ఏడాది మొదలైనప్పటి నుంచి పసిడి ధరలు ఆకాశన్నంతున్నాయని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు డ్రొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో రికార్డు సృష్టిస్తున్నాయి. దీంతో పెళ్లిల్లు చేసేవారికి బంగారం కొనుగోలు చేయాలంటేనే చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే గత కొద్దిరోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఈరోజు కూడా పసిడి ధరలు తగ్గాయి. గోల్డ్ రేట్స్ చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధరకు రూ.300 పెరిగి, 81,850కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధరకు రూ.330 పెరిగి, 89,290కి చేరుకుంది.
బంగారం ధర తగ్గడానికి దారి తీసే ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి, గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి లాభాల బుకింగ్. గత మూడు నెలలుగా బంగారం ఈటీఎంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా మధుపరులు పెద్ద ఎత్తున ఇందులో పెట్టుబడులు పెట్టారు. అయితే, ఈ గోల్డ్ ఈటీఎఫ్ బాండ్ల నుంచి లాభాలను సాధించడానికి తాత్కాలిక లాభం కోసం ఎదురు చూసే పెట్టుబడిదారులు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే బంగారం ధర మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. అలాగే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుకు అవకాశం కూడా లేకపోలేదు.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.81,850 కి చేరుకుంది.24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,290 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.81,850 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,290 చేరుకుంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.81,850 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,290 వద్ద కొనసాగుతోంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.82,200కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,290 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.82,200 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,290కి చేరుకుంది.
బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.82,200 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,290 పలుకుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.82,200 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,290కి చేరుకుంది.
కేరళలో, కోల్ కత్తా, పుణె, ఇతర నగరాల విషయానికి వస్తే.. ధర రూ.82,200 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,290 ఉంది.
Also Read: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఏటీఎం చార్జీల్లో మోత
వెండి ధరలు ఇలా..
దేశంలో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర రూ.1,10,000 కి చేరుకుంది.
హైదరాబాద్, కేరళ, విజయవాడలో కిలో వెండి ధర రూ.1,10,000 వద్ద కొనసాగుతోంది.
ముంబై, ఢిల్లీ, కోలకత్తా, బెంగళూరులో, పుణెలో కిలో వెండి ధర రూ. 1,01,000 ఉంది.