Varun Dhawan.. ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan)ఈ మధ్య వరుస సినిమాలు ప్రకటిస్తూ బిజీగా మారిపోయారు. ఇలాంటి సమయంలో కొంతమంది ఈయనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వరుణ్ ధావన్ హీరోయిన్స్ తో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఒక ఈవెంట్లో స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt)ను ముట్టుకోరానిచోట పట్టుకోవడంతో తీవ్రస్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. అలాగే మరో సినిమా షూటింగ్లో ఇంకో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ(Kiara advani)ని అందరి ముందే ముద్దు పెట్టుకోవడంపై కూడా వరుణ్ ధావన్ ను నెటిజన్స్ ఏకీపారేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇలా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఇతడి పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా స్పందిస్తూ.. ఆలియా, కియారాలతో తాను తప్పుగా ప్రవర్తించలేదని క్లారిటీ ఇచ్చారు.
శుభంకర్ మిశ్రా పాడ్ కాస్ట్ లో వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. “నేను సినిమా షూటింగ్ సమయంలో నాతోటి నటీనటులు అందరితో కూడా ఒకే రకంగా ఉంటాను. ముఖ్యంగా నాతో నటించే వారితో సరదాగా ఉండడం నాకు అలవాటు. అయితే ఇప్పటివరకు ఎవరు కూడా ఈ విషయం గురించి ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు నాపై వస్తున్న విమర్శలపై ప్రశ్న అడిగినందుకు సంతోషంగా అనిపిస్తోంది. నేను అందరి ముందు కియారాను కావాలనే ముద్దు పెట్టుకోలేదు. అది ఒక మ్యాగజైన్ ఫోటో కోసమే మేము అలా చేశాము. ఆ ఫోటోని నాతో పాటు కియారా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కదా.. దీనిని ఎలా తప్పు పడతారు? అంటూ ప్రశ్నించారు వరుణ్ ధావన్. అలాగే ఆలియాతో వచ్చిన మాటలపై కూడా మాట్లాడుతూ.. ఆలియా నాకు చాలా మంచి స్నేహితురాలు. ఆరోజేదో సరదాగా చేశాను. కానీ అది సరసం కాదు. మేమిద్దరం ఇప్పటికీ ఎప్పటికీ మంచి స్నేహితులమే” అంటూ చెప్పుకొచ్చారు వరుణ్ ధావన్. ప్రస్తుతం ఇతడు ఇచ్చిన క్లారిఫికేషన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
వరుణ్ ధావన్ సినిమాలు..
వరుణ్ ధావన్ ఇటీవలే సమంత (Samantha)తో కలిసి “సిటాడెల్ – హనీ బన్నీ” అనే వెబ్ సిరీస్ లో చేశారు. ఇందులో యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు. ముఖ్యంగా వరుణ్ ధావన్, సమంత మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఇకప్రస్తుతం వరుణ్ ధావన్ ప్రముఖ బ్యూటీ కీర్తి సురేష్ (Keerthi Suresh)తో ‘బేబీ జాన్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు అట్లీ కథను అందించగా.. కాళీస్ దర్శకత్వం వహించారు. ముఖ్యంగా కీర్తి సురేష్ ఈ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. వామిక గబ్బీ , రాజ్ పాల్ యాదవ్ జాకీర్ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan) క్యామియో పాత్ర పోషించారు.