E-Paper
Advertisement

Varun Lavanya marriage :  మెగా మ్యారేజ్.. నెట్ ఫ్లిక్స్ క్రేజీ ఆఫర్..

Varun Lavanya marriage :  మెగా మ్యారేజ్..  నెట్ ఫ్లిక్స్ క్రేజీ ఆఫర్..
Advertisement

Varun Lavanya marriage : సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటే ఫోటోలు, వీడియోల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తారు. పైగా జరిగేది డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే వాళ్లు పోస్ట్ చేసేదాకా వీడియోస్ కూడా బయట రావు. సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటే సోషల్ మీడియాలో క్యూరియాసిటీ విపరీతంగా ఉంటుంది. అందుకే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో సెలబ్రిటీల పెళ్లిల్ని కూడా విడుదల చేయడం బాగా ట్రెండింగ్ అయింది. 

నవంబర్ 1న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి మెగా కుటుంబం ,అల్లు కుటుంబం ఇటలీలో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి కానీ ఇంతవరకు పూర్తిస్థాయిలో వీడియోస్ విడుదల కాలేదు. మెగా అభిమానులు వరుణ్ తేజ్ పెళ్లి వీడియోల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Advertisement

గతంలో వరుణ్ తేజ్ చెల్లలు నిహారిక పెళ్లి నాగబాబు రాయల్ స్టైల్ లో ఎంతో ఘనంగా చేశాడు. దీనికి సంబంధించిన వీడియోస్ ను నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఈ వీడియోస్ ట్రెండింగ్ గా ఉన్నాయి అంటే పెళ్లి ఎంత వైభవంగా జరిగిందో చూడండి. మరోపక్క వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి వీడియో బయటకు రాలేదు.

నాగబాబు తన కొడుకు పెళ్లి వీడియో కూడా యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ వరుణ్, లావణ్య పెళ్లి వీడియోలకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే నాగబాబు ,వరుణ్ తేజ్ పెళ్లి వీడియోని యూట్యూబ్ ఛానల్ లో పెట్టాలి అనుకోవడం లేదట. ఎందుకంటే ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సెలబ్రిటీల పెళ్లి వీడియోని స్ట్రీమింగ్ చేయడానికి నాగబాబుకి భారీ ఆఫర్ ఇచ్చిందట.

Advertisement

నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ.. మెగా ప్రిన్స్ పెళ్లి వీడియో షూటింగ్ తీయడమే కాకుండా కొన్ని రోజుల తర్వాత నెట్ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ పై అప్లోడ్ కూడా చేస్తారట. ఇంతకీ దీని కోసం వాళ్లు ఇచ్చిన క్రేజీ ఆఫర్ ఎంతో తెలుసా.. అచ్చంగా 8 కోట్లు. ఈ న్యూస్ కనుక నిజమైతే ఇలా ఓటిటిలో ప్రసారమయ్యే మొదటి పెళ్లి మెగా ప్రిన్స్ దే అవుతుంది. గతంలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి స్ట్రీమింగ్ హక్కులను నెట్లిక్స్ పొందింది. కానీ కాంట్రాక్టు విషయంలో ఇష్యూస్ రావడం తో నయనతార పెళ్లి స్ట్రీమింగ్ ను నెట్ ఫ్లిక్స్ రద్దు చేసింది. మరి వరుణ్ పెళ్లి నెట్ ఫ్లిక్స్ లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×