Matka Twitter Review: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా.. భారీ యాక్షన్స్, సరికొత్త మట్కా. టాలీవుడ్ లక్కీ హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను అందుకుందని తెలుస్తుంది. ఈ సినిమా పై వరుణ్ తేజ్ ఆశలు పెట్టుకున్నాడు. నిజ జీవితం ఆధారంగా రూపోందించిన ఈ మూవీకి రిలీజ్ కు ముందే మంచి టాక్ ను అందుకుంది. ఇక ఇప్పుడు అదే సాగుతుందని తెలుస్తుంది. ఈ మూవీ గురించి పబ్లిక్ ఏమంటున్నారో.. ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారో చూద్దాం..
ఈ మట్కా మూవీ ఒక గ్యాంగ్ స్టర్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన స్టోరీ.. మట్కా సినిమా కథ ఒక మనిషి లైఫ్ జర్నీ. వాసు అనే వ్యక్తి బర్మా నుంచి వైజాగ్‌కు ఒక శరణార్థిగా వస్తాడు. వైజాగ్‌లో ఉన్న పెద్ద మనుషులుగా ప్రభావితమయ్యే వాళ్లంతా బయట నుంచి వచ్చిన వాళ్లే. వైజాగ్‌లో ఆ పెద్దలకు, వాసుకు మధ్య అధిపత్య పోరు ఎలా సాగింది మట్కా గ్యాబ్లింగ్ గేమ్ అంటే ఏమిటి? చివరికి వైజాగ్ ను అతను శాసించే స్థాయికి ఎలా ఏదిగాడు అనేది సినిమా స్టోరీ..
ఈ స్టోరీ మొత్తం వాసు అనే వ్యక్తి నడిపిస్తాడు.. యాక్షన్ సీన్లతో పాటుగా వరుణ్ తేజ్ పెర్ఫర్మాన్స్ బాగుంది.. ఈ హీరో కథల ఎంపిక బాగుండటంతో సినిమాకు పాజిటివ్ టాక్ ను అందుకుందని తెలుస్తుంది. నవంబర్ 14వ తేదీన రిలీజైన ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు ఒక రోజు ముందే అంటే 13వ తేదీ రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ సినిమా గురించి నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం..
మట్కా మూవీ అనుకున్నట్లునే భారీ యాక్షన్ కథనాలతో ఉందని నెటిజన్స్ ట్వీట్ చేస్తున్నారు. అయితే ప్రీమియర్ షోలకు జనాలు ఆసక్తి చూపించలేదు. ఇక మొదటి షో తర్వాత పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏది ఏమైన కూడా మొదటి నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ 4 రకాల లుక్స్ లో కనిపించాడట. ఇది అతని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అంటున్నారు. డైలాగ్ డెలివరీ కూడా కొత్తగా ఉందని చెబుతున్నారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి గ్లామర్ తోనే కాకుండా నటనతో కూడా ఆకట్టుకుంటుందట. కరుణ కుమార్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ చాలా ఎమోషనల్ గా, ఇన్స్పిరేషనల్ గా ఉంటాయని సమాచారం. మొదటి షో తర్వాత టాక్ ఎలా ఉంటుందో చూడాలి..
ఈ మూవీ పై హీరో వరుణ్ తేజా సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేసాడు. కొన్ని నెలల కఠిన శ్రమ, అంకిత భావానికి ప్రతిరూపం ఈ సినమిా. మట్కా మూవీని ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి మీ ముందుకు తెచ్చాం. మేము అన్ని రకాలుగా మీరు ఎంజాయ్ చేసే విధంగా రూపొందించిన మీకు ఈ మూవీ నచ్చుతుందని భావిస్తున్నాను అని వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు.. మరి కలెక్షన్స్ ఎలా రాబడుతుందో చూడాలి..
After months of hard work and dedication,
Matka finally hits theaters tomorrow.
I hope you guys like and enjoy
what we’ve made.
Thank you.🙏🏽#MATKA pic.twitter.com/6NQhIHiRKQ— Varun Tej Konidela (@IAmVarunTej) November 13, 2024