Facial Hair: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా చాలా మంది మహిళలు నేడు హార్మోనల్ ఇన్ బ్యాలన్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలను ఎదుర్కుంటున్న వారిలో ఫేషియల్ హెయిర్ అనేది కామన్‌గా మారింది. ఇందులో పెదవులపై అన్ వాంటెడ్ హెయిర్ కూడా ఒకటి . వీటిని తొలగించేందుకు పార్లర్ ల చుట్టూ తిరుగుతుంటారు మహిళలు. కానీ ఇది ఖర్చుతో కూడుకున్న పని.
ఎలాంటి ఖర్చు లేకుండా ఫేషియల్ హెయిర్ ఇంట్లోనే తొలగించుకోవచ్చు. కొన్ని రకాల హోం రెమెడీస్ ఇందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఏ హోం రెమెడీస్ ఫేషియల్ హెయిర్‌తో పాటు పెదాలపై హెయిర్ తొలగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అవాంఛిత రోమాలు స్త్రీల అందాన్ని తగ్గిస్తాయి. ఇలాంటి సమయంలోనే మహిళలు తరచుగా పార్లర్‌కు వెలుతుంటారు. కొన్ని హోం రెమెడీస్ సహాయంతో,పై పెదవులపై ఉన్న హెయిర్ తొలగించుకోవచ్చు.
పసుపు, పాలు, తేనె
కావలసినవి:
పసుపు- 1టీ స్పూన్
పాలు- కాస్త
తేనె- 1 టీ స్పూన్
పసుపు, పాలతో తయారు చేసిన పేస్ట్ పెదవులపై అవాంఛిత రోమాలను వదిలించుకోవడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. పసుపులో క్రిమినాశక గుణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. అంతే కాకుండా పాలు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. తేనె ముఖానికి తేమను అందిస్తుంది.
1. ఉపయోగించే విధానం:
ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఒక టీస్పూన్ పసుపు వేసి కలపాలి. ఇప్పుడు కొద్దిగా పాలు వేసి చిక్కని పేస్ట్‌లా చేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఈ పేస్ట్‌ను మందపాటి పేస్ట్‌లాగా కూడా చేసుకోవచ్చు. తేనె ఉంటే..అందులో అర టీస్పూన్ తేనెను కూడా కలుపుకోవచ్చు. ఈ సిద్ధం చేసిన పేస్ట్‌ని మీ పై పెదవులపై బాగా రాయండి.
15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. పేస్ట్ పూర్తిగా ఆరిపోయినప్పుడు, గోరువెచ్చని నీటితో కడగాలి.
ఈ ప్యాక్‌ని వారానికి 2-3 సార్లు అప్లై చేయడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందుతారు.
2. నిమ్మరసం ,చక్కెర:
కావలసినవి:
నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్
చక్కెర- 1 టేబుల్ స్పూన్
మీరు నిమ్మరసం, చక్కెరతో పేస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇది మీ డబ్బును ఆదా చేయడమే కాకుండా మీ చర్మానికి సహజసిద్ధంగా పోషణను అందిస్తుంది.విశేషమేమిటంటే ఈ వ్యాక్స్ ను రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదల కూడా తగ్గుతుంది.
ఉపయోగించే విధానం:
ఒక చిన్న గిన్నెలో చక్కెర, నిమ్మరసం,కాస్త నీరు వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మందపాటి, స్టిక్కీ పేస్ట్ అయ్యే వరకు తక్కువ మంట మీద వేడి చేయండి. మిశ్రమాన్ని ఎక్కువగా కదిలించకూడదని గుర్తుంచుకోండి. ఈ మిశ్రమం కాస్త చల్లబడినప్పుడు, చెంచా లేదా మీ వేళ్ల సహాయంతో మీ పెదాలపై అప్లై చేయండి. తర్వాత దానిపై క్లాత్ తో నొక్కి లాగాండి.
ఇది పై పెదాలపై ఉన్న హెయిర్ తొలగించడంలో సహాయపడుతుంది.
3. తేనె, నిమ్మరసం:
కావలసినవి:
తేనె- 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం- 2 టేబుల్ స్పూన్లు
తేనె, నిమ్మరసం రెండూ చర్మానికి చాలా మేలు చేస్తాయి. తేనెలో యాంటీ ఆక్సిండెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడతాయి. నిమ్మరసం సహజమైన బ్లీచ్, ఎక్స్‌ఫోలియంట్. ఇది ఫేషియల్ హెయిర్ తొలగించడంలో సహాయపడుతుంది.
ఉపయోగించే విధానం:
ఒక చిన్న గిన్నెలో ఒక చెంచా తేనె, నిమ్మకాయ రసం వేసి కలపండి. తద్వారా మందపాటి పేస్ట్ ఏర్పడుతుంది. ఈ పేస్ట్‌ను మీ పెదవులపై పలుచని పొర లాగా అప్లై చేయండి. ఈ పేస్ట్ మొత్తం హెయిర్ ఉన్న చోట అప్లై చేయండి .పేస్ట్‌ను సుమారు 15-20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత మీ వేళ్లను తడిపి.. పేస్ట్‌ను సున్నితంగా రుద్దండి. ఫలితంగా ముఖంపై ఉన్న హెయిర్ తొలగిపోతుంది. దీని తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. మాయిశ్చరైజర్ ఉపయోగించండి.
Also Read: ప్రతి రోజు రాత్రి ఇలా చేస్తే.. కొద్ది రోజుల్లోనే గ్లాసీ స్కిన్
4. శనగ పిండి, పాలు, పసుపు:
శనగ పిండి, పాలు, పసుపుల మిశ్రమం పై పెదవి వెంట్రుకలను తొలగించడానికి ఒక గొప్ప హోం రెమెడీ అని చెప్పొచ్చు. ఇది మీ అవాంఛిత రోమాలను తొలగించడమే కాకుండా మీ చర్మాన్ని మృదువుగా , మెరిసేలా చేస్తుంది.
ఉపయోగించే విధానం:
చిన్న గిన్నెలో శనగపిండి, పాలు, పసుపు వేసి చిక్కని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మీ పై పెదవులపై పలుచగా అప్లై చేయండి. దీని తరువాత, పేస్ట్ సుమారు 15-20 నిమిషాలు ఆరనివ్వండి. మీ వేళ్లను తడిపి, జుట్టు పెరుగుదలకు వ్యతిరేక దిశలో పేస్ట్‌ను సున్నితంగా రుద్దండి. పేస్ట్‌తో పాటు జుట్టు కూడా ఊడి వస్తుంది. దీని తరువాత, మీ ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.