Varun Tej : శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ముకుంద సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్. మొదటి సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి హీరో దొరికాడు అనిపించుకునేలా పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కంచె అనే సినిమాను చేశాడు వరుణ్ తేజ్. ఆ సినిమా కూడా వరుణ్ తేజ్ కి మంచి పేరును తీసుకొచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచిగానే ఆడింది అని చెప్పొచ్చు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన లోఫర్ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ పర్ఫామెన్స్ కి మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. పూరి కైండ్ ఆఫ్ హీరోగా కూడా వరుణ్ తేజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు అనిపించుకునేలా పర్ఫామెన్స్ ఇచ్చాడు.
ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన “మిస్టర్” సినిమా ప్లాప్ అయింది. యాక్చువల్ గా ఈ సినిమా కూడా మంచిగానే స్కోర్ చేస్తుందని అందరూ భావించారు. కానీ ఊహించిన విధంగా ఈ సినిమా డిజాస్టర్ పాలయ్యింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి నటించింది. వరుణ్ కెరియర్ లో ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమా ఫిదా. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిదా సినిమా శేఖర్ కమ్ములకు కూడా మంచి పేరును తీసుకొచ్చింది. ఈ సినిమాలో వరుణ్ పర్ఫామెన్స్ చాలా బాగుంటుంది. సాయి పల్లవి వరుణ్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి హిట్ సాధించింది.
Also Read : Ram Charan At Game changer teaser event : టీజర్ ఈవెంట్ లో పేరు పేరునా తెలుసు అని బానే కవర్ చేసాడు
ఘాజి సినిమాతో ప్రూవ్ చేసుకున్న సంకల్ప రెడ్డితో జతకట్టి అంతరిక్షం అనే సినిమాను చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా కూడా మంచి ప్రశంసలను తీసుకొచ్చింది. వాస్తవానికి ఘాజి సినిమా వరుణ్ తేజ్ కి విపరీతంగా నచ్చిందట. అందుకోసమే తనతో సినిమా కూడా చేశాడు. అయితే అంతరిక్షం సినిమా విషయానికి వచ్చేసరికి ఆ సినిమాకి దాదాపు కేవలం విఎఫ్ఎక్స్ కు ఐదు కోట్ల వరకు పెట్టారట. సినిమా బడ్జెట్ వచ్చి దాదాపు పది కోట్లు అయిందట. మొత్తానికి టోటల్ ప్రాజెక్టుకి 15 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అయితే ఈ సినిమా బడ్జెట్ తగ్గించే ప్రాసెస్ లో ఒక ఐదు రోజులు షూటింగ్ కూడా జరగనట్లు తెలిపాడు వరుణ్. అలా లో బడ్జెట్ లో సినిమా చేయడం వల్ల రిజల్ట్ కొంచెం తేడా కొట్టింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం కరుణ్ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ మట్కా అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇదివరకే రిలీజ్ అయిన ట్రైలర్ కూడా బానే ఆకట్టుకుంటుంది.