Ram Charan At Game changer teaser event : చిరుత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చరణ్ కు మంచి డెబ్యూ ఫిలిం అయింది. ఈ సినిమా తర్వాత మగధీర సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు చరణ్. ఆ తర్వాత చేసిన ఆరెంజ్ సినిమా ఊహించిన స్థాయిలోని ఆడలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా ఆ సినిమాలో అంతంత మాత్రమే ఆడాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ధ్రువ సినిమా తర్వాత రామ్ చరణ్ కంప్లీట్ గా మారిపోయారు అని చెప్పాలి. ఇక సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ కెరియర్ లోని బెస్ట్ సినిమా రంగస్థలం. చరణ్ లో పరిపూర్ణమైన నటుడుని ఆ సినిమాతో బయటకు తీసాడు సుకుమార్.
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ట్రిపుల్ ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ అని అవార్డు కూడా సాధించుకున్నాడు చరణ్. నేడు రామ్ చరణ్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఒక ప్రస్తుతం చరణ్ చేస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా సంక్రాంతి కానుక జనవరి 10వ తారీఖున రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజ్ అయిన పాటలు కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ ను లక్నోలో జరిపారు.
Also Read : Anushka Shetty: పెళ్లిపై రూమర్స్.. తొలిసారి స్పందించిన అనుష్క..!
ఈ టీజర్ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన మీడియా ప్రముఖులందరూ కూడా నాకు పేరుపేరునా తెలుసు అంటూ చెబుతూ వచ్చాడు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అసలు విషయం ఏంటంటే రామ్ చరణ్ తేజ్ కు పేర్లు సరిగ్గా గుర్తుండవు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ కూడా త్రిబుల్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో చాలా సార్లు చెప్పాడు. అలానే ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. అప్పుడు యాంకర్ తన పేరు అడగగానే సమాధానం చెప్పలేక రాజమౌళి రామ్ చరణ్ నవ్వుకున్నారు. ఇప్పుడు నిన్న ఈవెంట్ లో చరణ్ మాట్లాడిన మాటలు, ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూలో నవ్వుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే గేమ్ చేంజెర్ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. శంకర్ తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించారు.