Operation valentine: మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) తాజాగా కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వంలో మట్కా సినిమా చేస్తున్నారు. నవంబర్ 14వ తేదీన అనగా.. రేపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య , దీనికి తోడు వివాహం తర్వాత చేస్తున్న తొలి చిత్రం. మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆడియన్స్ లో హైప్ తీసుకురావడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు వరుణ్ తేజ్.
తన సొంత చిత్రాలను మీట్ అయిన వరుణ్ తేజ్..
ఇదిలా ఉండగా తాజాగా వరుణ్ తేజ్ తన సినిమాలను తానే పరిచయం చేసుకున్న వీడియో ఒకటి షేర్ చేశారు. ఈ వీడియోలో ఆయన నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation valentine) సినిమా మరిచిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2000 సంవత్సరంలో వచ్చిన హ్యాండ్సఫ్ అనే సినిమా ద్వారా బాల నటుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ తేజ్ , ఆ తర్వాత ‘ముకుందా’, సినిమాతో 2014లో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ మరుసటి ఏడాది ‘కంచె’, ‘లోఫర్’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన వరుణ్ తేజ్.. ‘మిస్టర్’, ‘ఫిదా’, ‘తొలిప్రేమ’ ఇలా పలు చిత్రాలలో నటించారు.
ఫస్ట్ పాన్ ఇండియా మూవీని మరిచిపోతే ఎలా..
ఇదిలా ఉండగా తాజాగా వరుణ్ తేజ్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. అందులో తన ఒక్కొక్క సినిమాకు సంబంధించి ఒక్కొక్క వ్యక్తి నిలబడి ఉంటారు. అందులో ఆయన తమకు నచ్చిన సినిమాలన్నింటినీ మీట్ అవుతూ లాస్ట్ కి తాను నటించిన తొలి పాన్ ఇండియా చిత్రాన్ని మరిచిపోయారు. వీడియోలో ముందుగా ‘ఎఫ్2’ సినిమాను మీట్ అయినా వరుణ్ తేజ్, ఆ తర్వాత ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘గద్దలకొండ గణేష్’ సినిమా వరకు సంతోషంగా వచ్చిన వరుణ్ తేజ్.. ‘గాండీవదారి అర్జున’ సినిమా చూసేసరికి ఒక్కసారిగా నమస్కారం పెడుతూ దూరం జరిగాడు. ‘మిస్టర్’, ‘గని’ సినిమాలు తనకు దూరం అన్నట్టుగా దూరంగా వెళ్లిపోయారు. ఇక చివర్లో ‘మట్కా’ సినిమా కనిపించడంతో హగ్ చేసుకుని మరీ ఆ సినిమా ఉన్న వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోయారు. ఇకపోతే ఇంతవరకు బాగానే ఉన్నా తన కెరీర్ లో మొదటి పాన్ ఇండియా చిత్రమైన ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఇక్కడ చూపించకపోవడం ఆశ్చర్యకరం.
ఆపరేషన్ వాలెంటైన్ మిస్..
ఇకపోతే ఈ వీడియో చూస్తే ఆపరేషన్ వాలెంటైన్ మిస్ అయింది. ఈ సంవత్సరమే రిలీజ్ అయిన చిత్రమిది.పైగా తెలుగు, హిందీ రెండు భాషల్లో కూడా రిలీజ్ చేశారు. అంతే కాదు వరుణ్ తేజ్ కి తొలి పాన్ ఇండియా చిత్రం కూడా ఇదే. కానీ ఇది ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు పోయిందో.. ఎవరికీ తెలియని పరిస్థితి.. అసలు వరుణ్ తేజ్ కైనా ఈ సినిమా గుర్తుందా..? గుర్తు లేదేమో.. అందుకే ఈ సినిమా పేరు కూడా ఎత్తడం లేదు.. అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా వరుణ్ తేజ్ తొలి పాన్ ఇండియా చిత్రాన్ని మరిచిపోవడంతో ఇలా అయితే ఎలా గురూ అంటూ నెటిజన్స్ కామెంట్లో చేస్తున్నారు.