Viral News: సాధారణంగా ఏటిఎం సెంటర్ లోకి మనం వెళ్లి డబ్బులు డ్రా చేస్తూ ఉంటాం. కానీ ఈ ఏటిఎం సెంటర్ కి ఓ వరాహం (పంది) వచ్చింది. డబ్బులు డ్రా చేయడానికి మాత్రం కాదండోయ్.. అసలు జెట్ స్పీడ్ లో వచ్చిన ఆ వరాహాన్ని చూసి, అక్కడి స్థానికులు పరార్. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో..
ఏటిఎం సెంటర్ కు వెళ్లామంటే, మనకు అత్యవసర అవసరం ఉండాల్సిందే. అలా ఏటిఎం కార్డు ఉంచడం, ఇలా డబ్బులు తీసుకోవడం ఇదే పరిపాటి. కానీ ఈ ఏటిఎం సెంటర్ కు వచ్చిన వరాహం చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. సాధారణంగా ఏటిఎం సెంటర్ల సమీపంలో ఎక్కువగా శునకాలు సంచరిస్తూ ఉంటాయి. సెక్యూరిటీ గార్డు లేకుంటే మాత్రం ఎంచక్కా సైలెంట్ గా ఓ కునుకు కూడా వేస్తుంటాయి శునకాలు.
కానీ ఇక్కడ ఓ వరాహమే ఏకంగా ఏటిఎం సెంటర్ లోకి దూరింది. కేరళలోని కొట్టాయం లో గల ఓ ఏటిఎం సెంటర్ వద్దకు వృద్దుడు వచ్చారు. తన ఏటిఎం కార్డు తీసి, నగదు విత్ డ్రా చేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. అలా తన పని తాను చేసుకుంటుండగా, ఒక్కసారిగా ధడేల్ మని శబ్దం. ఇంకేముంది అసలేం జరుగుతోందో అర్థం కాని స్థితి ఆ వృద్ధుడిది.
అలా వెనక్కి తిరిగారో లేదో వృద్దుడి గుండె గుభేల్ మన్నది. ఎక్కడైనా వరాహాన్ని చూస్తే శునకాలు వెంటపడి మరీ వేటాడుతాయి. అలా శునకాలు వెంటపడ్డాయో ఏమో కానీ, ఓ వరాహం ఏటిఎం అద్దాలను ధ్వంసం చేసి మరీ లోనికి ప్రవేశించింది. అప్పటికే ఏటిఎం లోపల గల వృద్దుడు షాక్ తిని, అక్కడి నుండి పరుగో పరుగు. ఏటిఎం అద్దాలు ధ్వంసమైనట్లు సమాచారం అందుకున్న ఏటిఎం సిబ్బంది రంగంలోకి దిగారు.
Also Read: Chennai Crime : తమిళనాడులో నిలిచిన వైద్య సేవలు.. ఒక్కడి కారణంగా నిరసనలు.. ఏం జరిగిందంటే.?
అసలేం జరిగిందో తెలుసుకొనేందుకు ఏటిఎం సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఆ ఫుటేజ్ లో రికార్డైన వీడియో ద్వారా అసలు విషయం తెలుసుకొని హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారట సిబ్బంది. కారణం ఏంటంటే ఎవరైనా దొంగలు ఈ దారుణానికి పాల్పడ్డారా అని అనుమానించిన వారికి ఫుటేజ్ ద్వారా వరాహం చేసిన విధ్వంసం అంటూ తెలిసింది. ఇక చేసేదేమిలేక ఏటిఎం అద్దాలు సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు వారు.
ఏటీఎం సెంటర్లోకి దూసుకొచ్చిన పంది
కేరళ రాష్ట్రం కొట్టాయంలో ఘటన
పంది దూసుకొచ్చిన వేగానికి పగిలిన ఏటీఎం సెంటర్ అద్దాలు
ఆ సమయంలో ఏటీఎంలో ఉన్న ఓ వృద్ధుడు భయంతో పరుగు #Kerala #Kottayam #Pig #Bigtv pic.twitter.com/TMNs4VCPte
— BIG TV Breaking News (@bigtvtelugu) November 13, 2024