Purohit Fighting: అందరికీ ప్రవచనాలు చెప్పాల్సిన పూజారులే సహనాన్ని కోల్పోయారు. తీవ్రపదజాలంతో ఒకరినొకరు తిట్టుకుంటూ దేవుడి ఎదుట కొట్టుకున్నారు. ఈ ఘటన ఏపీలో జరిగింది. తిరుపతిలో తలకోన శ్రీసిద్దేశ్వర స్వామి ఆలయంలో అర్చకుల మధ్య అకస్మాత్తుగా వాగ్వాదం చోటు చేసుకుంది. వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి.. పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్వాములోరి ఫైటింగ్ అంతా సీసీటీవీలో రికార్డు అయింది. గుడికి వచ్చిన భక్తులంతా వీరి గొడవను చూసి హతాశులయ్యారు.
అసలేంజరిగిందంటే.. తిరుమల.. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన పుణ్యక్షేత్రం. అత్యంత పవిత్రమైన ఆలయం. ప్రపంచం నలుమూల నుంచి భక్తులు వచ్చే ఆధ్యాత్మిక ప్రదేశం. అందుకే.. తిరుమలని ఆధ్యాత్మిక రాజధాని అని కూడా పిలుస్తారు. ఇదంతా.. తిరుమలకు ఉన్న ప్రాశస్త్యం.
Also Read: కీసరగుట్టలో అద్భుతం.. భక్తులంతా షాక్.. అసలేం జరిగిందంటే?
అలాంటి పుణ్యక్షేత్రాలు కొలువైయున్న ఆలయంలో తిరుపతిలోని తలకోన శ్రీసిద్దేశ్వర స్వామి టెంపుల్లో ఇద్దరు అర్చకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కార్తీక మాసం సందర్బంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటీవల ఆలయ ప్రధాన అర్చకుడు కుమారుడని పరిచారకుడిగా నియమించారు. ఇది నిభందనలకు విరుద్దమని మరో పూజారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో ఇద్దరి వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
ఆలయంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న అర్చకులు
తిరుపతి-తలకోన శ్రీసిద్దేశ్వర స్వామి ఆలయంలో ఘటన
మరో పరిచారకుడి అవసరం నిమిత్తం నిబంధనలకు విరుద్ధంగా ఫోర్జరీ సంతకాలతో ఇటీవల ఆలయ ప్రధాన పూజారి కుమారుడిని నియమించిన ఓ అర్చకుడు
ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన మరో అర్చకుడు
— BIG TV Breaking News (@bigtvtelugu) November 12, 2024