BigTV English

KTR on Current bill Charges: లోపం ఎక్కడ? ఎందుకు బూమరాంగ్ అవుతున్నాయి.. ఈసారి కేటీఆర్ టార్గెట్ అదేనా?

KTR on Current bill Charges: లోపం ఎక్కడ? ఎందుకు బూమరాంగ్ అవుతున్నాయి.. ఈసారి కేటీఆర్ టార్గెట్ అదేనా?

KTR on Current bill Charges: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అవకాశాన్ని వినియోగించుకుని బోర్లా పడుతున్నారు. లేటెస్ట్‌గా తెలంగాణ విద్యుత్ ఛార్జీలు పెంచుతారంటూ అప్పుడు ప్రచారం మొదలుపెట్టేశారాయన.


అధికార పార్టీపై ఉద్యమం చేయాలంటే జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. తేడా వస్తే ప్రజలు చాలా చులనకగా చూస్తారు. దానికి ఓ ఒక్కపార్టీ మినహాయింపు కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి బురద జల్లుతూనే ఉన్నారు కేటీఆర్ (KTR).

సంబంధం లేని విషయాన్ని తమకు అనుకూలంగా మలచుకుని ప్రత్యర్థులపై రాళ్లు వేయడం మొదలుపెట్టారు. ఈ విషయంలో బోర్లా పడ్డారు.. పడుతున్నారు కూడా. అయినా కాంగ్రెస్ సర్కార్ ఏదో చేస్తోందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.


అందుకు ఎగ్జాంపుల్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు. బీజేపీ నేతలు చేస్తున్న నిరసనలోకి ఎంట్రీ ఇచ్చి దాన్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అడ్డంగా దొరికిపోయారు ఆ పార్టీ నేతలు. సుప్రీంకోర్టు ఆదేశాల తో సైలెంట్ అయిపోయారు. తమ కారణంగా అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. పరీక్షలు రాసే అభ్యర్థుల్లో చులకనైపోయారాయన.

ALSO READ: మరోసారి కాళేశ్వరం బహిరంగ విచారణ.. కాళేశ్వరం ఓపెన్ కోర్టు

లేటెస్ట్‌గా తెలంగాణాలో విద్యుత్ ఛార్జీల పెంపు అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఛైర్మన్ మనోడేనని భావించి, విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్లు ఆయనతో చెప్పించారట. ఆ వెంటనే రంగంలోకి దిగి డ్రామా రక్తి కట్టించారు. ఈ నెలాఖరుతో ఛైర్మన్ రిటైర్ కాబోతున్నాడు. ఈలోపే ఆయన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా ప్లాన్ చేశారు.

బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పటికొట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యుత్ ఛార్జీల పెంపు ఆలోచన లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దీనిపై అధికారులకు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. అసలు విషయం తెలుసుకోకుండా బీఆర్ఎస్ విమర్శలు గుప్పించడాన్ని తప్పుపట్టారు.

విద్యుత్ ఛార్జీల పెంపు ఆలోచన లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దీనిపై అధికారులకు ఆయన క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. అసలు విషయం తెలుసుకోకుండా బీఆర్ఎస్ విమర్శలు గుప్పించడాన్ని తప్పుపట్టారు. గత ప్రభుత్వం మూడుసార్లు ఛార్జీలు పెంచింది. విద్యుత్ సంస్థల నష్టాలను వెల్లడించకుండా నాశనం చేసిందని దుయ్యబడుతున్నారు.

డిస్కంలు వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయని విద్యుత్ రంగ నిపుణులు సైతం ఆరోపిస్తున్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ఈనెల 23 అంటే బుధవారం హైదరాబాద్, గురువారం నిజమాబాద్ లో ఈఆర్‌సీ విచారణ జరుపుతోంది.

Related News

Schools holiday: ఆ జిల్లాలలో రేపు పాఠశాలలకు సెలవు.. బయటికి రావద్దంటూ హెచ్చరిక!

Hyderabad fire accident: హైదరాబాద్‌లో మళ్లీ అగ్ని అలజడి.. పెట్రోల్ బంక్‌లో మంటలు.. ఆ తర్వాత?

Aghapur Ganesh: గణపయ్య ఈసారి సీఎం రేవంత్ లుక్‌లో.. అఘాపూర్‌లో అలరించే విగ్రహం!

Hooligans in Madhapur: బైక్‌పై వెళ్తున్న యువతిని వేధించిన ఆకతాయిలు.. అక్కడ తాకేందుకు ప్రయత్నం..

Medak Flood: మెదక్ రామాయంపేటలో వరద ఆందోళన.. హాస్టల్‌లో చిక్కుకున్న 400 విద్యార్థులు

Kamareddy floods: కామారెడ్డిలో వర్షాల బీభత్సం.. 60 మందిని రక్షించిన రియల్ హీరోస్!

Big Stories

×