Mamata Banerjee: కోల్‌కతాలో హత్యాచార కేసులో సీల్దా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు సంజయ్ రాయ్‌కి జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో ఈ ఉరిశిక్ష ఖరారయింది. గతేడాది ఆగస్టు 9న జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం చోటుచేసుకుంది. అనంతరం ఈ కేసు అనేక మలుపులు తీసుకుంది. సుదీర్ఘ విచారణ అనంతరం సంజయ్‌రాయ్‌ను కోర్టు దోషిగా తేల్చింది. తీర్పు సమయంలో కోర్టు బయట భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టు చుట్టూ 500 మంది పోలీసులతో పహారాను ఉంచారు.
కోల్ కతాతో అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ హత్యాచార కేసును విచారించారు. హత్యాచార కేసులో సంజయ్ రాయ్‌ను జనవరి 18న దోషిగా తేల్చారు. తీర్పును ఈ రోజుకు రిజర్వ్ చేశారు. సంజయ్ రాయ్‌కు శిక్ష ఖరారు కావడంతో అనేక మంది సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ కేసులో CBI మరింత లోతుగా విచారణ చేసి ఉంటే మరి కొంత మంది నిందితులు బయటకు వచ్చేవారని అభిప్రాయపడ్డారు.
తాజాగా హైకోర్టు తీర్పుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరం ముద్దాయికి ఉరిశిక్షపడుతుందని భావించాం కానీ.. కోర్టు జీవిత ఖైది విధించిందన్నారు. ఈ కేసును కోల్ కతా పోలీసులు సీబీఐకి బలవంతంగా బదిలీ చేశారని అన్నారు. ఒక వేళ ఈ కేసు పోలీసుల చేతుల ఉంటే.. ఖచ్చితంగా మరణ శిక్ష పడేలా ప్రయత్నించేవారని పేర్కొన్నారు.
Also Read: కోల్ కతా డాక్టర్ కేసులో సంచలన తీర్పు.. మరణించే వరకు నిందితుడు జైలులోనే..!
ఇదిలా ఉంటే.. ట్రైనీ డాక్టర్ కేసులో పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు 160 పేజీలతో ఉన్నట్లు తెలిసింది. ఈ కేసు అరుదైన కేసు కిందకు రాదని.. అందుకే నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేయలేదని కోర్టు స్పష్టం చేసింది. బాధిత కుటుంబానికి 17 లక్షల రూపాయలు చెల్లించాలని కోల్‌కతా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పును పరిశీలించిన బాధితురాలి తల్లిదండ్రులు తమకు పరిహారం అక్కర్లేదని స్పష్టం చేశారు. శిక్ష ఖరారు చేయడానికి ముందు కూడా నిందితుడు సంజయ్ రాయ్ .. తన వాదనను మరోసారి వినిపించాడు. తాను ఏ తప్పు చేయలేదని.. తనను ఈ కేసులో ఇరికించారని సంజయ్ కోర్టులో పేర్కొన్నాడు. ఆధారాలను కూలంకుషంగా పరిశీలించిన అనంతరమే శిక్ష ఖరారు చేశామని న్యాయమూర్తి తెలిపారు.