BigTV English

Vd12 vs Hari Hara Veeramallu: రెండు ఒకేరోజు అంటే జరగని పని, ఏదో ఒక సినిమా వెనక్కి తగ్గడం ఖాయం

Vd12 vs Hari Hara Veeramallu: రెండు ఒకేరోజు అంటే జరగని పని, ఏదో ఒక సినిమా వెనక్కి తగ్గడం ఖాయం

Vd12 vs Hari Hara Veeramallu: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఒక సినిమాను ఒక డేట్ కి రిలీజ్ చేస్తున్నాం అని అనౌన్స్ చేస్తే ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఆ డేట్ కి సినిమా రిలీజ్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ సినిమాకు సంబంధించి ఏ మాత్రం వర్క్ పెండింగ్ ఉన్నా కూడా సినిమా వాయిదా ఈజీగా చేసేస్తున్నారు. దీంతో ప్రేక్షకుడు కూడా దాదాపు విసిగిపోయే పరిస్థితికి వచ్చేసాడు అని చెప్పాలి. ఒకటి రెండు రిలీజ్ డేట్స్ మారితే పరవాలేదు గాని కొన్ని సినిమాల విషయంలో చాలాసార్లు రిలీజ్ డేట్స్ మారుతూ ఉంటాయి.


చరణ్ నుంచి విజయ్ కు

పుష్ప సినిమా విషయంలో కూడా ఇలా రిలీజ్ డేట్ చాలాసార్లు మారింది. ఇక ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తన 12వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేసింది చిత్ర యూనిట్. ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా విజయ్ దేవరకొండను ఈ సినిమాలో చూపిస్తున్నాడు గౌతం. మొదట ఈ సినిమాను రామ్ చరణ్ తో చేద్దామని అనుకున్నాడు గౌతం. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా పట్టాలెక్కలేదు.


చిత్ర యూనిట్ అలర్ట్

విజయ్ సినిమా నుంచి ఫస్ట్ కొన్ని ఫొటోస్ లీకై వైరల్ గా మారాయి. దానితో చిత్ర యూనిట్ అలర్ట్ అయి అఫీషియల్ గా ఫోటోను రిలీజ్ చేసి సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే అనూహ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా కూడా అదే డేట్ న రిలీజ్ అవుతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ కి సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ కి మధ్య ఎంత మంచి అనుబంధముందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అని అంటే సితార ఎంటర్టైన్స్ బ్యానర్ నుంచి గాని హారిక హాసిని క్రియేషన్స్ నుంచి గాని ఏదైనా సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంటే అది ఖచ్చితంగా వాయిదా పడుతుంది.

గతంలో ఓజి సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అని తెలియగానే సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ అదే డేట్ కు లక్కీ భాస్కర్ సినిమాను అనౌన్స్ చేశాడు. ఆ తరుణంలోనే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా మేము వాయిదా వేస్తాము కళ్యాణ్ గారు సినిమాకి మేము ఎందుకు పోటీగా సినిమా దించుతామని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న విజయ్ దేవరకొండ సినిమాని ముందుగా అదే డేట్ కు అనౌన్స్ చేసారు. అయితే ఆ డేట్ కి సినిమా రిలీజ్ చేస్తారా లేదా అని ఇప్పుడు కొంతమందికి కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ఏదేమైనా అదే రోజు రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే కష్టమని చెప్పాలి. ఏదో ఒక సినిమా ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×