BigTV English

Target Dwarampudi: ద్వారంపూడి చిక్కినట్టేనా? కాకినాడలో షాపుల కూల్చివేత

Target Dwarampudi: ద్వారంపూడి చిక్కినట్టేనా? కాకినాడలో షాపుల కూల్చివేత

Target Dwarampudi: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చిక్కినట్టేనా? ఈ నేత చుట్టూ ఉచ్చు బిగిసుకుంటోందా? కూటమి సర్కార్ నెక్ట్స్ టార్గెట్ ద్వారంపూడేనా? ఆయన బినామీలపై దృష్టి పెట్టిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి బలంగా వినిపించిన గొంతుకది. ద్వారంపూడి- పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఆ తర్వాత వైసీపీ ఓడిపోవడం, కూటమి అధికారంలోకి రావడంతో జరిగిపోయింది. ఇక అసలు విషయానికొద్దాం.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి బినామీ వ్యాపారాలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. కూటమి అధికారంలోకి రాగానే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగేశారు. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని ప్రభుత్వం సీజ్ చేసింది. దీంతో ద్వారంపూడి ఆదాయానికి బ్రేక్ పడింది.


ద్వారంపూడి ఎమ్మెల్యేగా సమయంలో కాకినాడ టౌన్‌లో అక్రమ కట్టడాలు వెలిశాయి. వాటిపై అధికారులకు ఫిర్యాదులు అందడంతో సోమవారం ఉదయం రంగంలోకి దిగేశారు. ద్వారంపూడి అనుచరుల అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

ALSO READ: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదాలపై అనుమానాలు వద్దు.. కల్తీ నెయ్యిపై టీటీడీ క్లారిటీ

సంతచెరువు సెంటర్‌లో అక్రమంగా నిర్మించిన షాపుల సముదాయాన్ని జేసీబీ సహాయంతో కూల్చివేశారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ద్వారంపూడి అనుచరులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

నిర్మాణాలకు అనుమతులు లేవని, అందుకే కూల్చివేస్తున్నామని టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్పారు. సంవత్సరాలుగా తాము ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నామని, ఇప్పుడు అక్రమ నిర్మాణాలని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో ద్వారంపూడి మద్దతుదారులు-అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

చివరకు పోలీసుల సహాయంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. కాకినాడ టౌన్‌లో ఈ తరహా అక్రమ నిర్మాణాలు చాలానే ఉంటాయని అంటున్నారు స్థానికులు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టౌన్‌లో చిన్న స్థలం కనిపించినా కబ్జాకు గురైందని అంటున్నారు. మిగతా కబ్జాలపై అధికారులు దృష్టి సారించవచ్చని అంటున్నారు.

 

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×