E-Paper
Advertisement

Veera Dheera Sooran: వీర ధీర సూరన్ విక్రమ్ ను చూశారా.. ?

Veera Dheera Sooran: వీర ధీర సూరన్ విక్రమ్ ను చూశారా.. ?
Advertisement

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. నేడు ఆయన పుట్టినరోజు కావడంతో అధికారికంగా మేకర్స్ సినిమాలను అనౌన్స్ చేస్తూ విక్రమ్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇప్పటికే విక్రమ్ తంగలాన్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇది కాకుండా ఆయన నటిస్తున్న చిత్రం చియాన్ 62. SU అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను HR పిక్చర్స్ బ్యానర్ పై రియా శిబు నిర్మిస్తున్నారు. నేడు విక్రమ్ పుట్టినరోజున ఈ సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. వీర ధీర సూరన్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు మేకర్స్ తెలిపారు.

ఇక ఈ చిత్రంలో విక్రమ్ సరసన దుషార విజయన్ నటిస్తుండగా.. ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్నాడు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో కొంతమంది రౌడీలు విక్రమ్ ను చంపడానికి వస్తారు. కిరాణా కొట్టులో పనిచేస్తున్న విక్రమ్ వారిని కనిపెట్టేస్తాడు. ఒకపక్క కస్టమర్స్ కు సరుకులు ఇస్తూనే.. ఇంకోపక్క గన్ లోడ్ చేస్తూ ఉంటాడు. ఇక విలన్స్ లో ఒకడు వచ్చి వాడు.. వీడో, కాదో తెలియడం లేదు.. ముఖం కనిపించడం లేదు అని ఫోన్ లో చెప్పగానే.. విక్రమ్ వెలుగులోకి వచ్చి.. ఇప్పుడు కనిపిస్తుందా అని అడుగుతాడు.. వెంటనే ఆ విలన్స్ గ్యాంగ్ లో ఒకడు.. వాడేరా.. వాడే అని అరవడంతో మిగతావాళ్లందరూ విక్రమ్ ను చంపడానికి వస్తారు.

Advertisement

ఇక విక్రమ్ గన్ తీసుకొని ఒకడిని షూట్ చేయగానే మిగతా వారందరూ పారిపోతారు.  ఆ తరువాత ఇదేమి తెలియనట్టు.. షాపు కు వచ్చిన మహిళతో ఏం కావాలి.. తీసుకున్న సరుకులుకు డబ్బులు ఇవ్వమని అడగటం, చివర్లో వీర ధీర సూరన్ పడడంతో వీడియో ముగిసింది. మొత్తానికి ఈ టైటిల్ గ్లింప్స్ తోనే విక్రమ్ క్యారెక్టర్ ను చూపించేశారు. ఇక జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి విక్రమ్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×