Big Stories

Ghulam Nabi Azad: పోటీ నుంచి తప్పుకున్న ఆజాద్.. మరి కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా..?

Ghulam nabi azad recent news(Telugu news live today): ఎన్నికల వేళ కాశ్మీర్ వాతావరణం వేడెక్కింది. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన పార్టీ తెలిపింది.

- Advertisement -

జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానం నుంచి ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారని వారు తెలిపారు. ఆజాద్ వైదొలిగిన తర్వాత, అనంత్‌నాగ్-రాజౌరీ స్థానం నుంచి మహ్మద్ సలీమ్ పరాయ్ పార్టీ అభ్యర్థి కావచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -
Ghulam Nabi Azad recent news
Ghulam Nabi Azad

జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ, కాశ్మీర్ నివాసితుల నివాసితుల భూమి, ఉద్యోగ హక్కుల పరిరక్షణ కోసం తన పోరాటాన్ని కొనసాగించడానికి రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పిన కొద్ది రోజుల తర్వాత ఆజాద్ U-టర్న్ తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అయిన ఆజాద్ తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనేక కారణాలను కలిగి ఉన్నప్పటికీ, జమ్మూ కాశ్మీర్ ప్రజల ఉద్యోగాలు, భూమిని కాపాడటం తన ప్రాధాన్యత అని అన్నారు.

ఏప్రిల్ 2న, కేంద్ర మాజీ మంత్రి ఆజాద్ అనంత్‌నాగ్-రాజౌరీ స్థానం నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు.  గులాం నబీ ఆజాద్ సాహిబ్ అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని.. డీపీఏపీ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సల్మాన్ నిజామీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Also Read: ఆసక్తికరంగా అనంత్‌నాగ్.. గులాం నబీ ఆజాద్‌పై మెహబూబా ముఫ్తీ పోటీ..

డీపీఏపీ అభ్యర్థిగా ఆజాద్, PDPకి చెందిన మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఇండియా కూటమికి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ ప్రముఖ నాయకుడు మియాన్ అల్తాఫ్ అహ్మద్‌తో తలపడవలసి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News