Hari Hara Veeramallu :సినీ నటుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉండటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే ఈయన 2024 ఎన్నికల కంటే ముందుగా కమిట్ అయిన సినిమాలను మాత్రం తనకు వీలైనప్పుడల్లా పూర్తి చేస్తున్నారు. ఇక త్వరలోనే పవన్ నటించిన హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu)సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా జూన్ 12వ తేదీ వ్యక్తులకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా విషయంలో పవన్ పై చాలా విమర్శలు చేశారు.
పవన్ స్థానంలో డూప్?
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్స్ లో పాల్గొనలేదని ఎక్కువ భాగం పవన్ కళ్యాణ్ డూప్ సినిమాలో నటించారు అంటూ పవన్ యాంటీ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డూప్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను బయటపెట్టారు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సమయంలో ఓ సన్నివేశం జరుగుతుంది అది అక్బర్ బాబర్ కాలం నాటికి వెళ్ళాము. సెట్ మొత్తం అలాగే వేశారు పెద్ద గుర్రాలు కూడా తెప్పించారు.
డెడికేషన్ అంటే ఇది కదా…
ఇక పవన్ కళ్యాణ్ కూడా బ్లాక్ కలర్ పంచకట్టులో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కింద నుంచి గుర్రం మీద ఉండే విలన్ ఎగిరి తన్నాలి. ఈ షాట్ చేయడం కోసం మాస్టర్స్ బాబుగారు మీరు జస్ట్ కాలు అనండి మేము డూప్ వేసుకుని చేసుకుంటాము అన్నారు. అందుకు కళ్యాణ్ బాబు ఒప్పుకోలేదు. ఆయనే ఈ షాట్ చేశారు. అయితే ఈ షాట్ చేసే సమయంలో తన కాలు ఎక్కడో పట్టేసింది అయినా, కానీ వెనకడుగు వేయలేదు. ఇక షాట్ ఓకే అని చెప్పినప్పటికీ కళ్యాణ్ బాబుకు నచ్చలేదు మరొక టేక్ తీసుకుందామని పక్కకెళ్ళి కాస్త స్ప్రే కొట్టుకొని ఈ షాట్ కంప్లీట్ చేశారని, ఇది అసలైన డెడికేషన్ అంటే అంటూ స్వయంగా పవన్ డూప్ ఈ విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి షూటింగ్లో పాల్గొన్నారని ఈయన క్లారిటీ ఇవ్వటంతో విమర్శకులకు చెంపపెట్టుగా నిలిచింది.
Pk Dupe❌
PK original stunts✅
No dupe Use's in @PawanKalyan #HHVM lo dupes Use Chesadu, ani morigina kukkalu itu Randra…………..#HariHaraVeeraMallu pic.twitter.com/J3bK1fi1ox— AttiTudE mAsTeR #OG🚬 (@KalyanFanatics) May 29, 2025
ఇక హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలోనే కొంతమంది యాంటీ ఫాన్స్ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నప్పటికీ చిత్ర బృందం ఎప్పటికప్పుడు దీటుగా సమాధానం చెబుతున్నారు. ఇక డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా వెండితెరపై పవన్ కళ్యాణ్ ని చూడటం కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తున్నాయి.