BigTV English

Harudu Glimpse: కమ్ బ్యాక్ కోసం సిద్ధమయిన హీరో వెంకట్.. ‘హరుడు’ నుండి గ్లింప్స్ విడుదల

Harudu Glimpse: కమ్ బ్యాక్ కోసం సిద్ధమయిన హీరో వెంకట్.. ‘హరుడు’ నుండి గ్లింప్స్ విడుదల

Harudu Movie Glimpse: జగపతి బాబు హీరోగా నటించిన ‘శివరామరాజు’ సినిమాలో తన తమ్ముడి పాత్రలో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు వెంకట్. ఆ తర్వాత ఆయన హీరోగా కూడా పలు చిత్రాల్లో నటించారు. ఇప్పుడు తొలిసారి మాస్ హీరోగా వెంకట్ కమ్ బ్యాక్ ఇస్తున్న చిత్రమే ‘హరుడు’. డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తాళ్ళూరి దర్శకుడు. ఈ సినిమా సైలెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకొని ఏకంగా పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టింది. అందుకే ‘హరుడు’ గురించి ప్రేక్షకులకు తెలియడం కోసం ఈ సినిమా గ్లింప్స్‌ను ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్‌తోనే ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేశారు.


గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్

‘హరుడు’ సినిమాలో హీరో వెంకట్‌కు జోడీగా హెబ్బా పటేల్ నటించింది. వారితో పాటు శ్రీహరి, సలోని.. ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి పలు పాటలు విడుదల కాగా అవి మ్యూజిక్ లవర్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి జిన్నా సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఇక గ్లింప్స్ చూసిన తర్వాత సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని వారిలో నమ్మకం కలిగిందని మూవీ టీమ్ చెప్తోంది. ‘హరుడు’ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు రాజ్ తాళ్ళూరి, నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డితో పాటు హీరో వెంకట్ కూడా పాల్గొని ఈ సినిమాకు సంబంధించిన అనుభవాలను, జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.


Also Read: వచ్చేవారం థియేటర్లలో విడుదల కానున్న సినిమాలివే.. ఆ మూడు రోజులు సందడే సందడి

అయిదు నిమిషాలకే ఓకే చేశారు

ముందుగా అయిదు నిమిషాల్లోనే కథ విని ‘హరుడు’ సినిమాను నిర్మించడానికి డాక్టర్ ప్రవీణ్ రెడ్డి ఒప్పుకున్నారని దర్శకుడు రాజ్ తాళ్ళూరి అన్నారు. వెంకట్‌తో తనకు అయిదేళ్ల పరిచయం ఉందని బయటపెట్టారు. ఇప్పటివరకు వెంకట్ లవర్ బాయ్‌గా చాలా సినిమాల్లో నటించారు. కానీ ‘హరుడు’లో మాత్రం మాస్ హీరోగా చేశారని గ్లింప్స్ చూసిన ప్రేక్షకులకు అర్థమవుతుంది. వెంకట్ కూడా ‘హరుడు’ లాంటి మాస్ ఎంటర్‌టైనర్‌లో నటించడం బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు 60 శాతం పూర్తయ్యాయని అప్డేట్ ఇచ్చారు. నిర్మాత ప్రవీణ్ రెడ్డి డాక్టర్ అయినా సినిమాపై తపనతో ఇండస్ట్రీలో వచ్చారని ప్రశంసించారు.

షూటింగ్‌లో గాయాలు

‘హరుడు’లో ఆయనకు చాలా పవర్‌ఫుల్ రోల్ ఇచ్చారని దర్శకుడు రాజ్ తాళ్ళూరికి థ్యాంక్స్ చెప్పుకున్నారు వెంకట్. ‘‘ఇందులో నేను మొదటిసారి మాస్ పాత్ర చేశాను. నా పాత్రకు ధీటుగా హెబ్బా పటేల్ పాత్ర ఉంటుంది. డబ్బింగ్‌లో ఆమె నటన చూశాను. అలాగే నటశా సింగ్ ఇందులో మరో కీలక పాత్ర చేసింది. స్పెషల్ సాంగ్‌లో సలోని చేశారు. ఇందులో అయిదు పాటలు ఉన్నాయి. సంగీత దర్శకుడు మణి జెన్నా మంచి బాణీలు ఇచ్చారు. లోగడ షూటింగ్‌లో నాకు గాయాలు అయ్యాయి. అందుకే కొంత గేప్ కూడా తీసుకున్నాను. అందుకే ఈ సినిమాలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఫైట్స్ చేశాను. వచ్చే నెలలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు వెంకట్.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×