BigTV English

Biryani Offer: రండి బాబు రండి.. రూ.3కే చికెన్ బిర్యానీ, ఎక్కడో తెలుసా?

Biryani Offer: రండి బాబు రండి.. రూ.3కే చికెన్ బిర్యానీ, ఎక్కడో తెలుసా?

Spcieal Birayni Offers In Eluru: ఈ రోజుల్లో ఏ బిజినెస్ ప్రారంభించినా, పబ్లిసిటీ అనేది చాలా ముఖ్యం. ఎంత పబ్లిసిటీ ఉంటే బిజినెస్ అంత బాగా జరుగుతుంది. అందుకే, ఓపెనింగ్ రోజున స్పెషల్ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. తాజాగా ఇలాంటి ప్రయత్నమే చేశాడు ఓ బిర్యానీ రెస్టారెంట్ ఓనర్. కేవలం రూ. 3కే బిర్యానీ అంటూ ఓపెనింగ్ ఆఫర్ ప్రకటించాడు. ఈ విషయం తెలిసి జనాలు పోటెత్తారు. ఇంతకీ ఈ ఆఫర్ ప్రకటించిన రెస్టారెంట్ ఎక్కడ ఉందంటే?


ఏలూరులో అన్ లిమిటెబ్ బిర్యానీ సెంటర్ ఓపెనింగ్ ఆఫర్    

ఏపీలోని ఏలూరులో అన్ లిమిటెడ్ బిర్యానీ సెంటర్ గురించి జనాలు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఈ రెస్టారెంట్ కు రెండు బ్రాంచీలు ఉన్నాయి. మంచి టేస్టీ, రీజనబుల్ రేట్లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదే రెస్టారెంట్ యాజమాన్యం తాజాగా జంగారెడ్డి గూడెంలో మరో బిర్యానీ రెస్టారెంట్ ను ఏర్పాటు చేసింది. ఇవాళ ఈ బిర్యానీ సెంటర్ ను ప్రారంభించింది. ఓపెనింగ్ ఆఫర్ లో భాగంగా రూ. 3కే బిర్యానీ అంటూ రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ కేవలం మూడు గంటల పాటే అందుబాటులో ఉంటుందని కండీషన్ పెట్టింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ స్పెషల్ ఆఫర్ అందిస్తామని ముందుగానే వెల్లడించింది.


ఉదయం నుంచే బిర్యానీ సెంటర్ కు పోటెత్తిన జనాలు

అన్ లిమిటెడ్ బిర్యానీ సెంటర్ ఓపెనింగ్ ఆఫర్ గురించి చుట్టుపక్కల గ్రామాలు అన్నింటికీ తెలిసింది. దీంతో జనాలు పోటెత్తారు. ఉదయం నుంచే బిర్యానీ సెంటర్ దగ్గరికి చేరుకున్నారు. భారీగా క్యూలో నిలబడ్డారు. అనుకున్నట్లుగానే ఉదయం 9 గంటలకు స్పెషల్ ఆఫర్ ను ప్రారంభించారు రెస్టారెంట్ నిర్వాహకులు. ఒక్కో కస్టమర్ కు ఒక్కో బిర్యానీ చొప్పున కేవలం రూ. 3కే స్పెషల్ బిర్యానీ ప్యాకెట్ ను అందించారు. ముందుగా ప్రకటించినట్లుగానే 3 గంటల పాటు ప్రత్యేక ఆఫర్ ను అందించారు.

సంతోషం వ్యక్తం చేసిన కస్టమర్లు

ఏలూరులో ఇప్పటికే  అన్ లిమిటెడ్ బిర్యానీ సెంటర్లకు మంచి క్రేజ్ ఉందని.. ఇప్పుడు మరో బిర్యానీ సెంటర్ ను గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందంటున్నారు స్థానికులు. ఓపెనింగ్ రోజున కేవలం రూ. 3కే స్పెషల్ బిర్యానీ అందించడం హ్యాపీగా ఉందన్నారు. ఏదో ఆఫర్ ప్రకటించాం, ఐదో, పదో బిర్యానీ ప్యాకెట్లు పంచి టైమ్ అయిపోయిందని చెప్పకుండా, మూడు గంటల పాటు క్యూలో నిల్చున్న వారందరికీ బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చారని చెప్పారు. కచ్చితంగా ఈ బిర్యానీ సెంటర్ కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంటుందని అభిప్రాయపడ్డారు. మొత్తంగా స్పెషల్ ఓపెనింగ్ ఆఫర్ తో ఈ బిర్యానీ సెంటర్ పేరు ఏలూరు జిల్లా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపై కూడా కస్టమర్లు ఇలాగే తమ రెస్టారెంట్ కు రావాలని కోరుకుంటున్నారు నిర్వాహకులు.

Read Also: మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ – ఖైదీలకు స్పెషల్ మెనూ.. 4 రోజులు పండగే పండుగ!

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×