Meenakshi Chaudhary: ప్రతి ఏడాది ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ, ఎవరికి ఎప్పుడు హిట్ వస్తుంది అని చెప్పడం మాత్రం ఎవరివలన కాదు. కొంతమంది ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా సెటిల్ అవుతారు. ఇంకొంతమంది ఆ హిట్ అయ్యే సినిమా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మరికొంతమంది ఎన్ని సినిమాలు చేసినా తాము చేసే సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో కొనసాగుతూ ఉంటారు. ఇక ఈ మూడు కేటగిరీల్లో రెండో కేటగిరిలో చేరింది మీనాక్షీ చౌదరి.
మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈ చిన్నది.. ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అమ్మడి అందానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు కానీ, విజయాన్ని మాత్రం అందివ్వలేకపోయారు. అయినా పట్టువదలని లేడీ విక్రమార్కుడులా ఈ చిన్నది.. వరుసగా హిట్ కోసం ఎదురుచూస్తూ వచ్చింది. ఇక గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షీ.. కనిపించింది కొద్దీసేపు అయినా కూడా ఆమెనే హీరోయిన్ అని అనుకున్నారు అంటే అతిశయోక్తి లేదు. ఆ సినిమా పరాజయాన్ని అందుకున్నా మీనాక్షీకి మాత్రం మంచి విజయాన్ని అందించింది.
Venkatesh: కొడుకు ఇండస్ట్రీ ఎంట్రీపై వెంకీ మామ క్లారిటీ..!
గుంటూరు కారం సినిమా చూసిన ఫ్యాన్స్ ఎలారా బంగారపు హుండీని చిల్లర కోసం వాడుతున్నారు అని అనుకున్నారు. కానీ, నిర్మాత నాగవంశీ చిల్లరనే బంగారంలా వాడతారు. అలాంటిది బంగారపు హుండీని వదిలేస్తాడా.. ? ఆయన నిర్మించిన లక్కీ భాస్కర్ సినిమాలో మీనాక్షీ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా అమ్మడితలరాతను మార్చేసింది. సుమతి పాత్రలో ఈ చిన్నదాని నటనకు ఏ అమ్మాయి అయినా ఫిదా కావాల్సిందే.
ఇక ఈ సినిమా తరువాత మీనాక్షీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. లక్కీ భాస్కర్ నుంచి లక్కీ మీనాక్షీగా మారిపోయింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకీ మామ సరసన రొమాన్స్ చేయడానికి రెడీ అయిన ఈ బ్యూటీ తాజాగా మరో లక్కీ ఛాన్స్ ను పట్టేసింది. అది కూడా నాగవంశీ చలవే అని తెలుస్తోంది. కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు.
Jr NTR’s Dragon : తారక్ పాత్రను లీక్ చేసిన ప్రశాంత్ నీల్… మరీ ఇంత వైల్డ్ ఏంటి గురూ..
అప్పుడెప్పుడో జాతిరత్నాలు తరువాత అనౌన్స్ చేసిన సినిమా. ఆ సమయంలో శ్రీలీల టాప్ లో ఉండడంతో ఆమెను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ, ఈ సినిమా ఆలస్యం అవుతూ అవుతూ ఇదుగో ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
లక్కీ భాస్కర్.. సితారకు మంచి హిట్ ను తీసుకొచ్చిపెట్టింది. ఏ హీరోయిన్ అయినా సితారలో అడుగుపెడితే.. హిట్ రాకుండా బయటకు వచ్చిన హీరోయిన్ లేదు. ఇక ఇప్పుడు మీనమ్మ కూడా అంతే. మొత్తానికి సితారలో రెండో సినిమాను కూడా లైన్లో పెట్టిన ఈ చిన్నది అనగనగా ఒక రాజు సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.