Venkatesh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబానికి(Daggubati family)ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వివాదాలకు పోకుండా, కాంట్రవర్సీలకు దూరంగా ఉండే ఈ కుటుంబం ఎప్పుడూ ప్రత్యేకమే. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలను దోచుకున్న ఫ్యామిలీగా పేరు దక్కించుకుంది. దివంగత లెజెండ్రీ నటులు ఎన్టీఆర్(NTR),ఏఎన్ఆర్(ANR) కాలంలోనే స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు దక్కించుకున్నారు దగ్గుబాటి రామానాయుడు (Daggubati Ramanaidu). ఇక ఈయన వారసుడిగా ‘కలియుగ పాండవులు’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్(Venkatesh). విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వెంకటేష్ ఒకవైపు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తూనే.. మరొకరు మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో కూడా ఆకట్టుకుంటున్నారు.
అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన వెంకటేష్..
ఇకపోతే స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న వెంకటేష్ ఇప్పటికీ కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో మరొకసారి సినిమా చేస్తున్నారు వెంకటేష్. అలా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14వ తేదీన వచ్చే యేడాది విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగానే వెంకటేష్ బాలకృష్ణ(Balakrishna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4, 7వ ఎపిసోడ్ కి గెస్ట్ గా విచ్చేశారు. ఈ నేపథ్యంలోనే తన మేనల్లుడు నాగచైతన్య (Naga Chaitanya)గురించి మనకు తెలియని రహస్యాలు వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచారు.
మేనల్లుడి పై వెంకటేష్ కామెంట్స్..
నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య అభిమానులు, ప్రేక్షకుల ఆదరణతో ప్రస్తుతం నాలుగవ సీజన్ కూడా జరుగుతుంది. ఎవరు ఊహించని విధంగా సినీ సెలెబ్రిటీలు గెస్ట్లుగా వచ్చి ప్రేక్షకులకు ఆనందాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు వెంకటేష్ కూడా వచ్చారు. ఈ నెల 27వ తేదీన ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది.. ఇందులో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా స్టేజ్ పైన వెంకటేష్, తన అన్నయ్య ప్రముఖ నిర్మాత సురేష్ బాబు(Sureshbabu) కూడా కనిపించారు. ఇకపోతే కార్యక్రమంలో భాగంగా నాగచైతన్య ఫోటో చూపించి నాగచైతన్య గురించి పలు విషయాలు వెల్లడించాలని బాలయ్య కోరగా.. వెంకటేష్ మాట్లాడుతూ..” నాగచైతన్య అంటేనే ఒక ఎమోషనల్. చాలామంది పిల్లలను హగ్ చేసుకుంటాము. కానీ నాగచైతన్యను హగ్ చేసుకుంటే ఏదో తెలియని ఆనందం” అంటూ నాగచైతన్య పై తనకున్న ఇష్టాన్ని వెల్లడించారు. ఇకపోతే నాగచైతన్య చాలా మంచివాడ, ని ఎవరిని అంత త్వరగా హర్ట్ చేసే రకం కాదు అంటూ తన మేనల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలను వెల్లడించారు వెంకటేష్. ఇకపోతే ఈ విషయాలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది నెటిజెన్స్ పెద్దమ్మాయిని ఎందుకు నాగచైతన్యకు ఇవ్వలేకపోయారు అంటూ కామెంట్లు చేస్తుండగా వాస్తవానికి నాగచైతన్య, సమంత(Samantha) ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందని, లేకపోయి ఉంటే వీరిద్దరికి పెళ్లి జరిగేది అని కూడా మరికొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందులో నిజానిజాలు తెలియదు కానీ నాగచైతన్య అంటే వెంకటేష్ కి ఎంత ఇష్టమో అర్థమవుతుంది.