BigTV English

Sri Tej Family : శ్రీ తేజ్ కుటుంబానికి ఇప్పటివరకు వచ్చిన ఆర్థిక సాయం వివరాలు ఇవే..‌

Sri Tej Family : శ్రీ తేజ్ కుటుంబానికి ఇప్పటివరకు వచ్చిన ఆర్థిక సాయం వివరాలు ఇవే..‌

Sri Tej Family : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి 20 రోజులు పైగా అవుతున్నా కూడా ఉలుకు, పలుకు లేకుండా ఆసుపత్రి బెడ్ పైనే ఉన్నాడు శ్రీతేజ్.. అతను మెల్లగా కోలుకుంటున్నాడని కిమ్స్ వైద్యులు చెబుతున్నారు. బాలుడు ఆరోగ్యం గురించి కన్నా పంతం నెగ్గించుకోవాలని అందరు అనుకుంటున్నట్లు ఉన్నారు. రోజుకో కొత్త ఎపిసోడ్ తో ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించగా సినీ సెలబ్రిటీలు శ్రీతేజ్ ని పరామర్శించడానికి క్యూ కడుతున్నారు.. అంతేకాదు తోచిన సాయాన్ని కూడా ప్రకటిస్తున్నారు.. తెలంగాణ ప్రభుత్వం శ్రీతేజ్ కు అభయన్న హస్తంగా మారింది. తొక్కిసలాట జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటుంది.. ఇప్పటివరకు ఎవరు ఎంత వివరాళాలు ఇచ్చారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


రేవతి కుటుంబానికి ఇచ్చిన ఆర్థిక సాయం ఇవే…  

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ జనసందోహం ఏర్పడింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. రేవతి కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.దీంతో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తానికి అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు వచ్చేశారు.. ఇక శ్రీతేజ్ ను గత మూడు వారాలుగా తెలంగాణ ప్రతినిధులు చూసి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. సంఘటన జరిగినప్పటి నుంచి జగపతి బాబు, ఆర్. నారాయణమూర్తి కుటుంబానికి దైర్యం చెప్పి భరోసానిచ్చారు. తాజాగా ‘పుష్ప 2’ నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ లు రూ. 50 లక్షల భారీ నష్ట పరిహారాన్ని ప్రకటించారు. ఆ చెక్కును రేవతి భర్త భాస్కర్ కి అందజేశారు. వీటితోపాటు అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు అందరూ కలిపి రెండు కోట్లతో ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేయబోతున్నారట. అందులో రెండు కోట్ల రూపాయలు ఉంటాయి. వాటితో రేవతి శ్రీ తేజ్ కుటుంబానికి సాయం చేస్తారు. అలాగే దిల్ రాజు రేవతి భర్త భాస్కర్ కి ఫిలిం ఇండస్ట్రీలో ఒక పర్మినెంట్ ఉద్యోగాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. సినిమాటోగ్రాఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇప్పటికే 25 లక్షలు ఇచ్చాడు. అలాగే శ్రీ తేజ్ ను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు..


శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందంటే?

శ్రీతేజ్ ఆరోగ్యం మీద ఫుట్ ఎటెన్షన్ ఏర్పడింది. అందుకే కిమ్స్ వైద్యులు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్లను విడుదల చేస్తున్నారు. శ్రీతేజ్ బాగానే కోలుకున్నాడని నిన్న డాక్టర్లు తెలిపారు. ఎటువంటి ఆక్సిజన్ కానీ వెంటిలేటరీ సపోర్ట్ లేకుండా ఊపిరి తీసుకుంటున్నాడని తెలిపారు. అతను అప్పుడప్పుడు కళ్లు తెరుస్తున్నాడు కానీ.. ఐ కాంటాక్ట్ కానీ.. కుటుంబ సభ్యులను గుర్తు పట్టడం లాంటివి కానీ చేయడం లేదని వెల్లడించారు. సైగలను గమనిస్తున్నాడు కానీ.. మా మాటలను అర్థం చేసుకోలేకపోతున్నాడని వైద్యులు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు..త్వరలోనే శ్రీతేజ్ కోలుకోవాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×