Best Telugu Web series 2024 : మరో నాలుగు, ఐదు రోజుల్లో 2024కు గుడ్ బై చెప్పేసి, 2025లోకి అడుగు పెట్టబోతున్నాము. కొత్త ఏడాదిలో కొత్త కొత్తగా ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్న సినిమాలు, సిరీస్ ల గురించి ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. అయితే 2024 లో చాలా తెలుగు వెబ్ సిరీస్ లు ఓటిటిలోకి వచ్చాయి. అందులోనూ వివిధ జానర్ లలో ఉన్న సిరీస్ లు భారీ సంఖ్యలో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాయి. కానీ 2024లో ఎక్కువ మంది చూసిన తెలుగు వెబ్ సిరీస్ ఏంటో తెలుసా? అది ఇప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం.
2024లో థ్రిల్లర్, రొమాంటిక్, కామెడీతో పాటు పలు ఫ్యామిలీ డ్రామాలకు మంచి ఆదరణ దక్కింది. ముఖ్యంగా తెలుగులో ఓ వెబ్ సిరీస్ అయితే అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సిరీస్ పర్సనల్ గా కూడా కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ సిరీస్ 2024లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న తెలుగు సిరీస్ గా రికార్డును క్రియేట్ చేసింది. ఆ సిరీస్ మరేంటో కాదు ’90’s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ (90’s – A Middle Class Biopic) సిరీస్. 1990ల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సిరీస్ ఓ మధ్యతరగతి కుటుంబం కథ చుట్టూ సాగుతుంది. ఈ సిరీస్ లో సీనియర్ యాక్టర్ శివాజీ, వాసుకి ఆనంద్ లీడ్ రూల్స్ పోషించగా, మౌళి తనూజ్ ప్రశాంత్, రోహన్ వసంతిక, స్నేహల్ కీలక పాత్రలు పోషించారు. యంగ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు.
స్టోరీ లోకి వెళ్తే… చంద్రశేఖర్ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తాడు. వీరిది 90 ల కాలానికి చెందిన మధ్య తరగతి కుటుంబం. అప్పట్లో సగటు మధ్య తరగతి కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి? పిల్లల గురించి తల్లిదండ్రులు ఆలోచించే విధానం ఎలా ఉండేది? వారి ఆలోచనలు ఏంటి ? అనే విషయాలను డైరెక్టర్ ఈ సిరీస్లో ఆకట్టుకునే విధంగా చూపించారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సిరీస్ అప్పటి జ్ఞాపకాలను చాలామందికి గుర్తు చేసింది. ముఖ్యంగా 90 సిరీస్ అప్పటి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.
ఇక ఈ సిరీస్ కామెడీ పరంగా నవ్వించడమే కాకుండా, ఆలోచింపజేసే సీన్లతో పాటు ఎమోషనల్ గా సాగుతుంది. సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సెట్ అయింది. ముఖ్యంగా ‘సాంప్రదాయిని సుద్ధపూసిని’ అనే బిజిఎం సాంగ్ ఎంత పాపులర్ అయిందంటే, మీమ్స్ కి కూడా దాన్ని వాడేస్తున్నారు. ఇక ఈ సిరీస్ తర్వాత డైరెక్టర్ ఆదిత్య హాసన్ కి రెండు సినిమాలను తెరకెక్కించే ఛాన్స్ దొరికింది. కాగా ఈ ఏడాది జనవరి 5న ’90’s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ (90’s – A Middle Class Biopic) అనే ఈ వెబ్ సిరీస్ ఓటిటిలో స్ట్రీమింగ్ అయింది. ఈ సిరీస్ ఈటీవీ విన్ (ETV Win) లో అందుబాటులోకి వచ్చింది. 500 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది.