Venkatesh In Unstoppable Show: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రచయితగా కెరియర్ మొదలు పెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా మారాడు. అయితే త్రివిక్రమ్ దర్శకుడుగా మారిన తర్వాత తనలో ఉన్న డైరెక్టర్ రచయితను డామినేట్ చేయలేకపోయాడు. కొన్ని సినిమాలు బాగున్నా కూడా త్రివిక్రమ్ మార్క్ ఎక్కడో మిస్ అయింది అనే కంప్లైంట్స్ ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే అప్పుడు త్రివిక్రం రాసిన సినిమాలకు విజయభాస్కర్ దర్శకత్వం వహించినా కూడా త్రివిక్రమ్ రైటింగ్ విజయభాస్కర్ డైరెక్షన్ డామినేట్ చేసింది. ఇప్పటికీ స్వయంవరం నువ్వు నాకు నచ్చావ్, చిరునవ్వుతో, మన్మధుడు, మల్లీశ్వరి వంటి సినిమాల ప్రస్తావన వస్తే అందరికీ ముందు గుర్తొచ్చేది త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎందుకంటే ఆ సినిమాల్లో రైటింగ్ ఆ స్థాయిలో ఉంటుంది.
ముఖ్యంగా నువ్వు నాకు నచ్చావ్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వెంకటేశ్వర్లు అనే క్యారెక్టర్ ను త్రివిక్రమ్ రాసిన విధానం ఇప్పటికి నవ్వు తెప్పిస్తుంది. మొక్కపాటి నరసింహారావు రాసిన బారిష్టర్ పార్వతీశం పుస్తకం ఎన్నిసార్లు చదివిన ఎలా అయితే బోర్ కొట్టదో, త్రివిక్రమ్ రాసిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా కూడా అలానే బోర్ కొట్టదు. చూసిన ప్రతిసారి నవ్వు తెప్పిస్తూనే ఉంటుంది. ఒక అందమైన ప్రేమ కథను హాస్యంతో పాటు హృదయానికి హత్తుకునేలా రాశాడు త్రివిక్రమ్. ముఖ్యంగా సినిమాలో వెంకటేష్ నటించిన కామెడీ ఇప్పటి వరకు వచ్చిన ఏ సినిమా రీప్లేస్ చేయలేకపోయిందే అని చెప్పాలి. సినిమా వచ్చి దాదాపు 20 ఏళ్లు దాటినా కూడా ఆ సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికీ వెంకటేష్ కి గుర్తున్నాయి అంటే ఆ సినిమా స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.
బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ అనే షోకి విక్టరీ వెంకటేష్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ షోలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నారు. అంతేకాకుండా మరోసారి నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోని డైనింగ్ టేబుల్ దగ్గర జరిగే ప్రేయర్ సీన్ ను మరోసారి రీ క్రియేట్ చేశారు విక్టరీ వెంకటేష్. ఆ సీన్ ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి డైలాగును ఈ షోలో వెంకటేష్ చెప్పిన విధానం మరోసారి నవ్వు తెప్పించింది. అవి అంతలా గుర్తుండడానికి కూడా కారణం వెంకటేష్ కెరియర్ లో ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అని చెప్పాలి. మొత్తానికి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చూడాలని చాలామంది ఎదురుచూస్తున్నారు. అది వర్కౌట్ అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే అందరూ ఇప్పుడు పాన్ ఇండియా మోజులో పడి తమ ఒరిజినల్ స్ట్రెంత్ ని పక్కన పెట్టేయడం మొదలు పెడుతున్నారు కాబట్టి.
Also Read : Hari Hara VeeraMallu : ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్, సాంగ్ బ్యాక్ డ్రాప్ ఏంటంటే.?