Hari Hara VeeraMallu : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాజెక్టులలో హరిహర వీరమల్లు సినిమా ఒకటి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదట రిలీజ్ అవుతున్న సినిమా ఇది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చాలా ఏళ్లు తర్వాత చేస్తున్న స్ట్రైట్ ఫిలిమ్ ఇది. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలన్నీ కూడా రీమేక్. ఇక హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు స్ట్రైట్ ఫిలిమ్స్ గా రిలీజ్ కాలు ఉన్నాయి. ప్రస్తుత మీ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు విపరీతమైన అంచనాలు పెరిగాయి. అలానే ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ కూడా మరింత క్యూరియాసిటీ పెంచుతుంది. ఈ సినిమాకి మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకుడిగా కూడా చాలా సినిమాలు చేశారు. అయితే ఆ సినిమాలేవి పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. కిరణ్ అబ్బవరం హీరోగా రూల్స్ రంజన్ అనే సినిమా కూడా చేశారు. ఆ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. ఇకపోతే హరిహర వీరమల్లు సినిమా మీద మాత్రం మంచి నమ్మకం చాలా మందికి ఉంది. అలానే సాయి మాధవ్ బుర్ర కూడా ఈ సినిమా కథ గురించి ఒకప్పుడు భారీ ఎలివేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో క్రిష్ జాగర్లమూడి తో పాటు తాను కూడా బయటకు వచ్చేసాను అని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. ఈ సినిమాలో నుండి ఒక ఫస్ట్ సాంగ్ రిలీజ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ దీని గురించి అధికారిక ప్రకటన రాలేదు.
హరిహర వీరమల్లు సినిమా నుంచి మొదటి సింగిల్ ను జనవరి ఒకటో తారీకు 12Am కు రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే దీని గురించి అధికారకు ప్రకటన కూడా త్వరలో రావాల్సి ఉంది. అంతేకాకుండా ఈ సాంగ్ వీర అనే క్యారెక్టర్ చాలా లేట్ నైట్ సునీల్ మరియు సుబ్బరాజు టీం తో ఈ పాటను పాడుకోబోతున్నట్లు సినిమాలు సిచువేషన్ ఉంటుందంట. అందుకోసమని ఈ పాటను కూడా రాత్రి 12 గంటలకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. అయితే ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులు మరోసారి youtube లో రికార్డుల మోత మోగనుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా ఫైల్ లాంగ్వేజెస్ లో పవన్ కళ్యాణ్ వాకల్స్ అందించినట్లు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ పాటలు ఎంత జోష్ తో పాడుతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ పాట ఎటువంటి సంచలనం క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. అజ్ఞాతవాసి టైంలో కూడా పవన్ కళ్యాణ్ పాడిన పాటను డిసెంబర్ 31 రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
Also Read : Naveen Polishetty : మామూలు టాలెంట్ కాదు, ఆ వాయిస్ కూడా తనదే