Vanuatu earthquake: దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి వనౌటు తీరం అతులాకుతలమైంది. దీని ప్రభావం రిక్కర్ స్కేలుపై 7.3గా నమోదు అయ్యింది. కొన్ని సెకన్లుపాటు భూమి కంపించడంతో ఆదేశ ప్రజలు భయంతో వణికిపోయారు. భూకంపం ధాటికి పలు చోట్ల భవనాలు నేలమట్టం అయ్యాయి.
వనౌటు దేశానికి అతి పెద్ద సిటీగా ఉండే పోర్టు విలాకు వెస్ట్ ప్రాంతంలో భూకంపం కేంద్రాన్ని కనుగొన్నారు. 57 కిలోమీటర్లు లోతులో దీన్ని గుర్తించారు. గతంలో ఇదే ప్రాంతంలో 5.5 తీవ్రతతో ప్రకంపనలు సంభవించిన విషయం తెల్సిందే.
పోర్ట్ విలాలోని పలు దేశాల రాయబార కార్యాలయాలు దెబ్బతిన్నాయి. అమెరికా, ఫ్రాన్స్ సహా వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్లు అందులో ఉంటున్నారు. ఎత్తైన భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో రాయబార కార్యాలయాలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి.
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఒకరు మృతి చెందినట్టు తెలుస్తోంది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్టు వార్తా ఏజెన్సీలు చెబుతున్నాయి. అక్కడ జరిగిన నష్టంపై తొందరగా అంచనాకు రాలేదని ఆదేశ అధికారుల మాట. భూకంపం నేపథ్యంలో కమ్యూనికేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ALSO READ: బంగ్లాదేశ్‌లో ఎన్నికలు అప్పుడే.. తేల్చిచెప్పిన యూనుస్
కాకపోతే భూకంపం సమయంలో ప్రజలు భయంతో పరుగులు పెడుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పనిఫిక్ మహాసముద్రంలో 80 చిన్న చిన్న దీవుల సమూహమే వనౌటు దేశం. ఇక్కడ 3.50 లక్షల మంది నివశిస్తున్నారు. అయితే రింగాఫ్ ఫైర్ జోన్ లో ఉండడంతో ఈ ప్రాతంలో తరచు భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి.
వనౌటులో సంభవించిన భూకంపంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు ఎలాంటి సునామీ ప్రమాదం లేదని అధికారులు చెబుతున్నారు. వనౌటులో వంతెనలు బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. తీర ప్రాంత ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
🇻🇺 #BREAKING A powerful 7.4 magnitude earthquake struck Vanuatu on December 17, 2024, causing damaged US Embassy
Initial reports indicate significant damage to infrastructure, homes, and buildings.#earthquake #Vanuatu pic.twitter.com/MlPdnPBM74
— Weather monitor (@Weathermonitors) December 17, 2024
👉పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో మంగళవారం భారీ భూకంపం సంభవించింది.
👉రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది.
👉కొన్ని సెకన్ల పాటు తీవ్రంగా కంపించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
👉భూకంపం ధాటికి పలుచోట్ల భవనాలు నేలకూలాయి. pic.twitter.com/36MZmcQKpX— ChotaNews (@ChotaNewsTelugu) December 17, 2024