E-Paper
Advertisement

Venkatesh: సైంధవ్ టీజర్ లో సైకో పదం పై స్పష్టత ఇచ్చిన..వెంకీ

Venkatesh: సైంధవ్ టీజర్ లో సైకో పదం పై స్పష్టత ఇచ్చిన..వెంకీ
Advertisement

Venkatesh: వెంకటేష్ హీరోగా, శైలేష్ కొలను డైరెక్షన్ లో సంక్రాంతికి బరిలోకి దిగనున్న లేటెస్ట్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ సైంధవ్(SAINDHAV). ఈ మూవీ వచ్చే జనవరి 13న సంక్రాంతి కానుకగా మిగిలిన స్టార్ హీరోల చిత్రంతో పోటీ పడనుంది. ఈ మేరకు చిత్రం నుంచి విడుదలైన లేటెస్ట్ టీజర్.. తండ్రి కూతుర్ల సెంటిమెంటుతో చాలా అట్రాక్టివ్ గా ఉంది. అంతకంటే అట్రాక్టివ్ గా ఇందులో వెంకీ పర్ఫామెన్స్ ఉంది. చాలా రోజుల తర్వాత ఒకప్పటి యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్ లో వెంకటేష్ చాలా డిఫరెంట్ గా కనిపించాడు.

టీజర్ విడుదల సందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న వెంకటేష్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ ,దగ్గుపాటి రానా కాంబినేషన్ లో వచ్చిన రానా నాయుడు వెబ్ సిరీస్ తో తనపై వచ్చిన విమర్శల గురించి స్పందించారు. ప్రస్తుతం తను నటిస్తున్న సైంధవ్ మూవీ తప్పకుండా అందరినీ ఎంతో అలరిస్తుంది అని వెంకటేష్ ఎంతో నమ్మకంగా చెప్పారు. కలియుగ పాండవులతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన వెంకటేష్, అభిమానుల అండదండలే ఈరోజు తనని ఈ స్థానంలో నిలబెట్టాయి అని చెప్పుకొచ్చారు.

Advertisement

సైంధవ్ మూవీ వెంకటేష్ సినీ కెరియర్ లో 75వ చిత్రం.. ఇంత సుదీర్ఘకాలం తన సినీ ప్రయాణం సాగిన తన కెరీర్ లో ప్రేక్షకుల కారణంగా ఇప్పటివరకు ఎటువంటి డల్ మూమెంట్ రాలేదు అని వెంకీ అన్నారు. గత కొద్దికాలంగా ఎక్కువ ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్ తరహా చిత్రాలు చేస్తూ వచ్చిన వెంకీ ..ఈసారి అటువంటి మూవీస్ ఎన్ని వచ్చినా వద్దు అనుకొని శైలేష్ కొలను చెప్పిన సైంధవ్ కు ఓకే చెప్పారు. ఈ మూవీ స్టోరీ తో పాటు కాన్సెప్ట్ కూడా నచ్చడంతో వెంకీ ఈ హై న్యూ స్టైల్ ఆఫ్ యాక్షన్ కు సిద్ధపడ్డాడు.

ఇక సైంధవ్ మూవీ గురించి మాట్లాడుతూ.. ఈ మూవీలో తన పాత్ర చాలా డిఫరెంట్ గా మునుపెన్నడూ చూడనంత వైల్డ్.. క్రేజీగా ఉంటుంది అని అన్నాడు. ఇందులో ఉన్న ఎమోషన్స్ కి ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవుతారట. ఇది కేవలం ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే చూడదగ్గ సినిమా అనే ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా అన్ని వర్గాల వారు ఎంజాయ్ చేసే మూవీ గా ఉంటుందట. ఈ సినిమాలో ప్రేక్షకులు సరికొత్త తరహాలో కొత్త వెంకీని చూస్తారు అని వెంకటేష్ ధీమాగా అన్నాడు.

Advertisement

ఇక టీజర్ లో వినిపించిన సైకో పదంపై కూడా వెంకటేష్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ మూవీలో వెంకటేష్ పూర్తి పేరు సైంధవ్ కోనేరు.. అంటే అందరూ తనని షార్ట్ కట్ లో ముద్దుగా సైకో అని పిలుస్తారట. అయితే ఇక ఈ మూవీకి సీక్వల్ ఉంటుందా అని ఎదురైన ప్రశ్నకి.. ఒకవేళ ప్రేక్షకులు ఆదరిస్తే తప్పకుండా ఉంటుంది అని సమాధానం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో రానా నాయుడు సీక్వెల్ కూడా ఉంటుంది అని వెంకీ క్లారిటీ ఇచ్చాడు. ఈ ఒక్క వెబ్ సిరీస్ కారణంగా ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తనను గుర్తిస్తున్నట్లుగా చెప్పిన వెంకీ ..హిందీ వర్షన్ తో పోలిస్తే తెలుగులో ఆ కంటెంట్ ను చాలా వరకు తగ్గించామని, భవిష్యత్తులో మరింత తగ్గించి రానా నాయుడు 2 ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని చెప్పాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×