BigTV English

Australia vs Sri Lanka: హమ్మయ్యా.. పైకి ఎగబాకిన ఆస్ట్రేలియా

Australia vs Sri Lanka: హమ్మయ్యా.. పైకి ఎగబాకిన ఆస్ట్రేలియా

Australia vs Sri Lanka: ఓడలు బళ్లవుతాయి…బళ్లు  ఓడలవుతాయని అంటారు అందుకేనేమో…మొన్నటి వరకు ఆస్ట్రేలియా అంటే అందరికీ హడల్…ఐదుసార్లు వరల్డ్ కప్ కొట్టడమే కాదు, రెండుసార్లు రన్నరప్ కూడా అయిన ఆస్ట్రేలియా పరిస్థితి ఇప్పుడేంద్రా ఇలా అయిపోయిందని అంతా అనుకున్నారు.


చివరికి అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ…ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఎందుకిలా చెప్పుకోడం అంటే… 48 ఏళ్ల చరిత్రలో పాయింట్ల పట్టికలో ఎప్పుడూ ఆస్ట్రేలియా అట్టడుక్కి వెళ్లలేదంట. ఇదే మొదటిసారంట. ఎట్టకేలకు  శ్రీలంకపై విజయం సాధించారు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే సొంత దేశంలో అభిమానులు అప్పుడే ఉతికి ఆరబెట్టడం మొదలైంది.

అంతేకాదు ఈ విజయంతో ఇప్పుడు అడుగు నుంచి రెండు స్థానాలు ఎగబాకి 8వ స్థానంలోకి వచ్చారు. మరొక సంగతేమిటంటే సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు కూడా.  ఇక ఇక్కడ నుంచి మిగిలిన ఆరు మ్యాచ్ ల్లో ఐదు గెలిస్తే ఆశలు పెట్టుకోవచ్చునని క్రీడా పండితులు సెలవిస్తున్నారు.


ఇదిలా ఉండగా  ఆడిన మూడు మ్యాచుల్లో ఓడిన శ్రీలంక సెమీస్ ఆశలను మరింత క్లిష్టం చేసుకుంది. ఇప్పటి నుంచి అన్నింటి మీదా వరుసగా గెలుస్తూ…చివర్లో రన్ రేట్లు మీద ఆధారపడుతూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. ఇది మన ఇండియాకి బాగా అలవాటు కదా. అంతేకాదు మన ఇండియన్స్ కూడా.. ఈ లెక్కలు వేయడంలో మహా నిష్ణాతులే…బహుశా ఆ పరిస్థితి ఈ వరల్డ్ కప్ లో వచ్చేలా లేదని అంతా అంటున్నారు. ఆ గడ్డు పరిస్థితిని దాటామని కూడా అంటున్నారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×