Vennela Kishor : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న కమెడియన్స్ లో మోస్ట్ టాలెంటెడ్ వెన్నెల కిషోర్. చాలామంది కమెడియన్లు ఉన్నా కూడా వెన్నెల కిషోర్ టైమింగ్ వేరు. వెన్నెల సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్న కిషోర్, ఆ తర్వాత దర్శకుడుగా కూడా సినిమా చేశాడు. అయితే ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. చాలామందికి వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అంటే విపరీతంగా ఇష్టపడుతుంటారు. కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా వెన్నెల కిషోర్ మాట్లాడిన మాటలు చాలామందికి విపరీతంగా నవ్వులు తెప్పిస్తాయి. రీసెంట్ గా తన ప్రధాన పాత్రలో శ్రీకాకుళం షర్లక్ హోమ్స్ అనే సినిమాను కూడా చేశాడు. ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఇక ప్రస్తుతం సారంగపాణి జాతకం అనే సినిమాలో కూడా కీలకపాత్రను పోషించాడు కిషోర్.
శ్రీ విష్ణు సింగిల్
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోస్ లో శ్రీ విష్ణు ఒకరు. వరుసగా ఫెయిల్యూర్స్ వస్తున్న తరుణంలో సామజవరగమన సినిమాతో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు శ్రీ విష్ణు. దాదాపుగా 50 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది ఆ సినిమా. ఆ సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చాడు అని అందరితో అనిపించుకున్నాడు. ఆ తర్వాత చేసిన ఓం భీమ్ బుష్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక స్వాగ్ సినిమా చాలామందికి నచ్చిన కూడా కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు. ఇక ప్రస్తుతం కార్తీక్ రాజు దర్శకత్వంలో సింగిల్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ఈ సినిమా మే తొమ్మిది ని విడుదల కానుంది. ఈ సినిమాలో కిషోర్ కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.
ఆమెకు సైలెంట్ ఫ్యాన్స్ ఉన్నారు
ఇక సింగిల్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను జరిపింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ లో వెన్నెల కిషోర్ మాట్లాడుతూ కేతిక శర్మ ఉద్దేశించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఉంటాయి అవి రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఎవరూ చూడరు. బయటకు కూడా ఎవరు చెప్పారు. కానీ ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నప్పుడు మాత్రం ఎగబడి చూస్తూ మంచి కలెక్షన్స్ ఇస్తారు. ఆరెంజ్, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలకు ఎటువంటి ఫ్యాన్ బేస్ ఉందో, కేతిక శర్మ కి కూడా అటువంటి సైలెంట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎవరు బయటకు చెప్పరు కానీ ఆమె ఫోటో పెడితే మాత్రం లైక్ కొడతారు. అందులో నేను కూడా ఒకడిని అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : Santhosh Narayanan : ఆ రెండు సినిమాలకు పని చేస్తానని నాకు నేనుగా అడిగా