Victory Venkatesh : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే చాలామంది దర్శకులు హీరోలతో మళ్ళీ మళ్ళీ పనిచేస్తూ ఉంటారు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలియంది కాదు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయానికి వస్తే స్వయంవరం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రచయితగా అడుగుపెట్టాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించి, త్రివిక్రమ్ కి వరుస అవకాశాలను తీసుకొచ్చి పెట్టింది. అయితే త్రివిక్రమ్ మొదటి పని చేసిన స్టార్ హీరో అంటే విక్టరీ వెంకటేష్. నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఇప్పటికి చూసినా కూడా మంచి ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అవుతుంది.
వెంకటేష్ టైమింగ్
విక్టరీ వెంకటేష్ కెరియర్ లో నువ్వు నాకు నచ్చావ్ సినిమాకి ఉన్న స్థానం వేరు స్థాయి వేరు. సినిమా మొదటినుంచి చివరి వరకు కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. కేవలం నవ్వించడం మాత్రమే కాకుండా ఆలోచించే విధంగా ఎన్నో సీన్స్ ఈ సినిమాలో కనిపిస్తాయి. తండ్రి కొడుకుల మధ్య బాండింగ్. అలానే ప్రేమ వంటి విషయాలను త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతంగా రాశాడు. ఈ సినిమా తర్వాత వెంకటేష్ కి మల్లీశ్వరి సినిమాని కూడా రాశాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. అయితే ఈ రెండు సినిమాలు కేవలం రచయితగాని త్రివిక్రమ్ శ్రీనివాస్ పనిచేశాడు. దర్శకుడుగా విక్టరీ వెంకటేష్ తో ఇప్పటివరకు సినిమాను చేయలేదు.
త్రివిక్రమ్ కి ఫోన్ చేయండి
విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేస్తాడు అని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఒక టైం లో విక్టరీ వెంకటేష్, నాని కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తారు అని చాలామంది ఊహించారు. కానీ ఆ సినిమా కూడా ఎందుకో కుదరలేదు. ఇక రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నారా అని వెంకటేష్ ని అడిగినప్పుడు. నేను రెడీగా ఉన్నాను ఇప్పుడే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఫోన్ చేయండి స్టోరీ ఎప్పుడు రాస్తావు అని అడగండి. ఫోన్ చేయండి త్రివిక్రమ్ కి త్వరగా సినిమా చేయమనండి అంటూ రియాక్ట్ అయ్యారు విక్టరీ వెంకటేష్.
Also Read : Vennela Kishor : ఆమెకు సైలెంట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది