Santhosh Narayanan : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో సంతోష్ నారాయణన్ ఒకరు. సంతోష్ నారాయణ గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. తను ఎన్ని సినిమాలు చేసినా కూడా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా సినిమాతోనే తెలుగులో బాగా పాపులర్ అయ్యాడు. దసరా సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఫస్ట్ టైం దర్శకుడుగా పరిచయమైన శ్రీకాంత్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా నానిని ఇంతకుముందు ఎప్పుడు ఏ దర్శకుడు చూపించిన విధంగా చూపించి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. నాని కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది ఈ సినిమా. ఇక మరోసారి శ్రీకాంత్ ఓదెల నానితో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు.
కల్కి సినిమా అవకాశం
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఉంది అని ప్రూవ్ చేస్తూ చాలా తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి తర్వాత సుకుమార్, నాగ అశ్విన్ వంటి దర్శకులు తెలుగు సినిమా సత్తాను చూపించడం మొదలుపెట్టారు. ఒక ప్రభాస్ నటించిన కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని సాధించి దాదాపు 1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. కల్కి సినిమా ఎంత పెద్ద హిట్ అయినా కూడా పాటలు పెద్దగా సక్సెస్ సాధించలేదు. దానిలో కేవలం ఒక పాట మాత్రమే చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. కానీ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
ఆ రెండు సినిమాలకు నేనే అడిగాను
కల్కి సినిమా మ్యూజిక్ చిత్ర యూనిట్ కి నచ్చలేదేమో అని సంతోష్ నారాయణన్ కి అనిపించిందట. అందుకే కల్కి 2 సినిమా అవకాశం కోసం చాలా భయంగా అడిగాడట. ఇక కార్తీక్ సుబ్బరాజ్ టాలెంట్ ఏంటో అందరికీ తెలిసిన విషయమే. షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టిన కార్తీక్ నేడు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక స్టార్ డైరెక్టర్. కార్తీక్ చేసిన చాలా సినిమాలకు సంతోష్ సంగీతం అందించాడు. పిజ్జా, జిగర్తాండ, మెర్కురి వంటి సినిమాలకు సంతోష్ సంగీతం అందించాడు. అయితే మొదటిసారి రజనీకాంత్ హీరోగా కార్తీక్ పెట్ట సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కలిసి పని చేద్దామా అని సంతోష్ అడిగాడట. అయితే వెయిట్ నేను చెప్తాను అని కార్తీక్ చెప్పాడట. ఆ సినిమాకు మాత్రం అనిరుద్ ను తీసుకున్నాడు కార్తీక్. అయితే ఈ విషయంపై కూడా సంతోష్ స్పందిస్తూ 100% అనిరుద్ ఆ సినిమాకి న్యాయం చేశాడు యూత్ కి ఏం కావాలో అది ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత మళ్లీ తనకు రెట్రో సినిమాకి అవకాశం ఇచ్చాడు అని తెలిపాడు సంతోష్.
Also Read : Naga Chaitanya: తండ్రి కాబోతున్న స్టార్ హీరో… పాపం వాళ్లని దీంట్లోకి లాగొద్దు బ్రో