BigTV English

Venu Sriram: ప‌వ‌న్ క‌ళ్యాణ్ డైరెక్ట‌ర్‌కి హీరోలు అవ‌కాశాలివ్వ‌టం లేదా?

Venu Sriram: ప‌వ‌న్ క‌ళ్యాణ్ డైరెక్ట‌ర్‌కి హీరోలు అవ‌కాశాలివ్వ‌టం లేదా?
Venu Sriram

Venu Sriram : సినిమా రంగంలో లక్ ఏటైనా మారుతుంటుంది. ఒక్కోసారి హిట్ సినిమాలు చేసిన డైరెక్ట‌ర్‌కి అవ‌కాశాలు వెంట‌నే రావు. అలాంటి లిస్టులో ఓ ద‌ర్శ‌కుడు చేరార‌ని ఇప్పుడు సినీ స‌ర్కిల్స్‌లో బ‌ల‌మైన టాక్ వినిపిస్తోంది. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. వేణు శ్రీరామ్‌. ఈయ‌న దిల్ రాజు క్యాంప్‌లో డైరెక్ట‌ర్‌. తొలి చిత్రం ఓ మై ఫ్రెండ్ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌టంతో చాలా కాలం త‌ను సైలెంట్‌గా ఉండిన వేణు శ్రీరామ్‌.. త‌ర్వాత ఎంసీఏ సినిమాతో హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే. అది కూడా దిల్ రాజు బ్యాన‌ర్‌లోనే.


త‌ర్వాత అదే బ్యాన‌ర్‌లోనే ఏకంగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో వ‌కీల్ సాబ్ సినిమా చేశారు. అది కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. జ‌న‌సేన పార్టీ ప్రారంభించిన త‌ర్వాత‌.. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత చేసిన తొలి చిత్ర‌మిది. అంత పెద్ద హిట్ మూవీ తర్వాత ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఐకాన్ అనే మూవీని అనౌన్స్ చేశారు. పుష్ప ది రైజ్ త‌ర్వాత ఈ సినిమా ఉంటుంద‌ని ప్ర‌కటించారు. అయితే ఏమైందో ఏమో కానీ.. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. సినిమా ఆగిపోయింద‌నే అంటున్నారు. బ‌న్నీ నెక్ట్స్ బాలీవుడ్ సినిమా, త్రివిక్ర‌మ్ సినిమా చేయ‌బోతున్నార‌నే వార్త‌లు రావ‌ట‌మే అందుకు ఉదాహ‌ర‌ణ‌ల‌ని అంటున్నారు అంద‌రూ

ఇప్పుడు వేణు శ్రీరామ్.. బ‌న్నీకి చెప్పిన క‌థ‌ను ఇండ‌స్ట్రీలోని ఇత‌ర హీరోల‌కు కూడా చెబుతున్నార‌ట‌. అయితే వారెవ‌రూ ఐకాన్ సినిమా చేయ‌టానికి ఆస‌క్తి చూప‌టం లేద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది మ‌రి. వేణు ఇప్ప‌టికే నితిన్ స‌హా కొంత మంది హీరోల‌ను క‌లిసిన‌ప్ప‌టికీ వారు పెద్దగా ఇంట్రెస్ట్ చూప‌టం లేదు. ఇప్పుడు వేణు శ్రీరామ్ కింక‌ర్తవ్యం ఏంటో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×