BigTV English

Veena Srivani: మా ఆయన జాతకంతో నాకు పనిలేదు.. చైతూ నుంచి నాకు గిఫ్ట్ కావాలి అంటోన్న వేణుస్వామి భార్య

Veena Srivani: మా ఆయన జాతకంతో నాకు పనిలేదు.. చైతూ నుంచి నాకు గిఫ్ట్ కావాలి అంటోన్న వేణుస్వామి భార్య

Venu Swami Wife Veena Srivani asking gift naga Chaitanya: ఆయన తనకి తాను ఓ జాతక శిఖామణి అనుకుంటాడు. ఎందుకంటే సినిమా, పొలిటికల్ సెలబ్రిటీలకు వద్దన్నా జాతకం చెబుతాడు కాబట్టి. ఒక్కో సందర్భంలో చీకట్లో రాయి తగిలినట్లు కొన్ని కరెక్ట్ గానే అవుతాయి. ఎప్పుడైతే ఆయన చెప్పింది తలక్రిందులైతే ఇక సోషల్ మీడియాలో ఆయనపై మామూలు కామెంట్స్ ఉండవు. నాగచైతన్య, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లపై ఈయన ఈ మధ్య జాతకాలు తెగ చెప్పేశాడు. ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల పని అయిపోయినట్లుగానే చెప్పాడు కల్కి విజయంతో ప్రభాస్,ఏపీ మంత్రిగా పవన్ కళ్యాణ్ లు మళ్లీ ఫాంలోకి వచ్చేశారు. దీనితో ఆయన అభిమానులు వేణుస్వామిని సోషల్ మీడియాలో తెగ ఆరేసుకున్నారు.


వేణు స్వామికి అండగా..

ఈయనగారిని నమ్మి కొందరు సినీ సెలబ్రిటీలు తమ ఇళ్లలో శాంతి పూజలు కూడా చేయించుకున్నారట. రీసెంట్ గా నాగచైతన్య, శోభిత ల ఎంగేజ్ మెంట్ విషయంలో వేణుస్వామి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇద్దరూ దుర్ముహూర్తంలో ఏకమయ్యారని వారి దాంపత్యం కూడా ఎక్కువ కాలం నిలవదని జాతకం చెప్పేశాడు. ఇంకేముందు సినీ వర్గం ఒక్కసారిగా భగ్గుమంది. సినిమా జర్నలిస్టు సంఘాలు, మహిళా సంఘాలు విడివిడిగా వేణుస్వామిపై కంప్లైంట్ ఇచ్చారు వివిధ పోలీస్ స్టేషన్లలో. అయితే వేణుస్వామి భార్య మాత్రం ఈ విషయంలో ఆయనకు అండగా నిలిచింది. తాను కూడా జర్నలిస్ట్ నే అంటూ ఆయన భార్యగా కాకుండా సాధారణ వ్యక్తిగా ఆలోచిస్తే వేణుస్వామి కేవలం జాతకమే చెప్పాడు గానీ దగ్గరుండి వీళ్లను విడదీయలేదు కదా..ఎందుకంతా రియాక్ట్ అవుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు.


జర్నలిస్టులకు విలువలు లేవు

వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి తన భర్తకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను సైతం వదిలారు. ముందుగా చైతూ, శోభితలకు కంగ్రాట్స్ చెబుతున్నాను. మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి. ఎంగేజ్ మెంట్ ఎందుకు డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటే పోయేది. అయినా ప్రపంచంలో ఎన్నో టాపిక్స్ ఉంటే మీకు వేణుస్వామి మీద చర్చించడంలో ఆనందం ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. పైగా ఇప్పుడున్న జర్నలిస్టులు అసలు జర్నలిస్టులే కాదంటున్నారు. తాను జర్నలిజం లో ఉన్నప్పుడు విలువలు చాలా ఉండేవని అన్నారు. జాతకం చెప్పడం తప్పు కాదు కదా..అదేదో పెద్ద నేరం చేసినట్లు ఫీలవుతున్నారు.ఏదైనా ప్రజా సమస్యలపై జర్నలిస్టులు దృష్టి పెడితే బాగుంటుందని ఆమె అంటున్నారు.

వీణా శ్రీవాణిపై ట్రోలింగ్స్

మీడియాలో విలువలు లేకుండా పోతున్నాయన్నారు. ఈ మధ్య రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారంలోనూ మీడియా అతి చేసిందని..మరి వారి గురించి ఇష్టారాజ్యంగా రాతలు రాసిన మీపై కేసులు పెట్టేవాళ్లు లేరా? అంటూ ఫైర్ అయిన శ్రీవాణి నాగచైతన్య, శోభిత ఎంగేజ్ మెంట్ సందర్భంగా తనకు వాళ్లు గిఫ్ట్ ఇవ్వాలని అన్నారు. నేను కూడా ఓ సింగర్ నే..అందుకనే ఆ పరిచయంతోనే వాళ్లను అడుగుతున్నా..ఏది ఏమైనా వాళ్ల కాపురం బాగుండాల అంటున్నారు ఆమె అయితే నెటిజన్లు మాత్రం శ్రీవాణిని బాగా ట్రోలింగులు చేస్తున్నారు. ముందుగా మీ ఆయనను చెత్త జాతకాలు చెప్పుకుండా కంట్రోల్ చేసుకోమని సలహాలు కూడా ఇస్తున్నారు.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×