E-Paper
Advertisement

Venu Swamy: సలార్ పై వేణుస్వామి జోస్యం.. వైరలవుతున్న వీడియో.. టెన్షన్ లో ఫ్యాన్స్

Venu Swamy: సలార్ పై వేణుస్వామి జోస్యం.. వైరలవుతున్న వీడియో.. టెన్షన్ లో ఫ్యాన్స్
Advertisement

Venu Swamy: వేణుస్వామి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సమంత – నాగచైతన్య పెళ్లి చేసుకోక ముందే వారిద్దరూ పెళ్లయ్యాక విడిపోతారని జోస్యం చెప్పారు. వారిద్దరి విడాకులతో ఆయన జోస్యం పవర్ ఫుల్ అని చాలా మంది నమ్మారు. అప్పటి నుంచి ఆయనకు ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. కెరీర్ బాలేని హీరోయిన్స్ కూడా ఆయన వద్ద పూజలు చేయించుకున్నాక హిట్స్ అందుకున్నారు. వేణుస్వామి జోస్యం చెబితే తిరుగుండదని పేరు. ఇప్పుడదే ప్రభాస్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది.

ఆదిపురుష్ సమయంలో ఆ సినిమా హిట్ అవ్వదని చెప్పేశారు. అదే నిజమైంది. అప్పుడే సలార్ పై కూడా ఆయన కామెంట్స్ చేశారు. ప్రభాస్ కు సలార్ కూడా కష్టమేనని చెప్పుకొచ్చారు. ఇటీవలే రిలీజైన సలార్ ట్రైలర్ కూడా అలానే ఉంది. ట్రైలర్ లో ప్రభాస్ కనిపించిన తీరు, చెప్పిన డైలాగ్స్ చూసిన ఫ్యాన్స్ నీరసపడిపోయారు. ట్రైలర్ ను ఒక రేంజ్ లో ఊహించుకున్న డార్లింగ్ అభిమానులు నిరాశ చెందారు. దాంతో రిలీజ్ కు ముందే సినిమాపై నెగిటివ్ టాక్ మొదలైంది. ఈ సినిమా కూడా సలార్ కు ఫెయిల్యూర్ తెస్తుందేమోనన్న సందేహాలు మొదలయ్యాయి.

Advertisement

ఒక పక్క సలార్ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతుంటే.. ఆదిపురుష్ సమయంలోనే సలార్ పై వేణుస్వామి చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అవుతోంది. సలార్ విషయంలో వేణుస్వామి చెప్పిందే నిజమవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ మరింత ఆందోళన చెందుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, బాహుబలి -2 ప్రభాస్ కు బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చాయి. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ప్రేక్షకులను అలరించలేదనడంలో సందేహం లేదు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రెండుపార్టులుగా వస్తున్న సలార్ పైనే కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఇది కూడా ఫ్లాప్ అయితే.. కల్కి, స్పిరిట్ లు కూడా డౌటేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సలార్ విషయంలో వేణుస్వామి చెప్పింది నిజమవుతుందో లేదో.. డిసెంబర్ 22న తేలిపోతుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×