Big Stories

Air Polluted Cities : ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలు.. టాప్-20 లిస్ట్ ఇదే..

Air Polluted cities : ప్రపంచంలోని అత్యంత వాయు కాలుష్య నగరాల జాబితాను వరల్డ్ ఆఫ్ స్టాటిస్‌టిక్స్ సంస్థ ప్రకటించింది. టాప్ 20 జాబితాను విడుదల చేసింది. ఇందులో 14 నగరాలు భారత్ లోనే ఉన్నాయి. పాకిస్తాన్ లోని లాహోర్ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో చైనాలోని హోటాన్ నగరం ఉంది. మూడో స్థానంలో ఉన్న నగరం ఇండియాలోని భీవాడి.

- Advertisement -

కాలుష్యనగరాల జాబితాలో భారత్ లోని ఢిల్లీ, దర్భంగా, అసోపూర్, న్యూఢిల్లీ, పాట్నా, ఘజియాబాద్, ధరుహేరా, చాప్రా, ముజఫర్‌నగర్, గ్రేటర్ నోయిడా, బహదూర్‌ఘర్, ఫరీదాబాద్, ముజఫర్‌పూర్ ఉన్నాయి. పాకిస్థాన్ లో పెషావర్ , ఫైసలాబాద్ కాలుష్యనగరాల లిస్టులో ఉన్నాయి. ఇరాక్ లోని బాగ్దాద్, చాడ్ దేశంలోని అన్ జమేనా నగరంలో కూడా కాలుష్యం ఎక్కువగా ఉంది.

- Advertisement -

ప్రపంచంలోని టాప్20 కాలుష్య నగరాల్లో భారత్ లోనే 14 సిటీలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News