BigTV English

Pochampally Ikkat Sarees: పోచంపల్లి ఇక్కత్ చీరలకు మరో అంతర్జాతీయ అవార్డు

Pochampally Ikkat Sarees: పోచంపల్లి ఇక్కత్ చీరలకు మరో అంతర్జాతీయ అవార్డు

Pochampally Ikkat Sarees: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, కంచిపట్టు చీరలను తయారు చేసేది మన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోనే. ఇక్కడి కంచి పట్టుచీరలు పోచంపల్లి చేనేత కార్మికుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. చేనేత కార్మికుల సృజనాత్మకత, నూతన డిజైన్లతో చేనేత వస్త్రాల తయారీ, ఉత్తమ మార్కెటింగ్, ఆన్ లైన్ విక్రయాలు చేస్తోన్న భూదాన్ పోచంపల్లికి మరో ఆసియా అంతర్జాతీయ అవార్డు దక్కింది.


మన పోచంపల్లి పట్టుచీరల ఖ్యాతి ఖండాతరంగా వ్యాప్తి చెందుతోంది. విదేశీయులు సైతం మన చీరలను ఇష్టపడుతున్నారు. ఇక్కత్ చీర పోచంపల్లిలో తయారైన అద్భుత కళారూపం అనడంలో అతిశయోక్తి లేదు. చేనేత రంగంలో ఉత్తమ సేల్స్, తయారీ, కొత్త డిజైన్లు, ఆన్ లైన్ సృజనాత్మకత , ఆఫ్ లైన్ విక్రయాల నిర్వహణకు ప్రతి ఏటా రూలా – ఆసియా సంస్థ బెస్ట్ హ్యాండ్లూమ్ అవార్డును ప్రదానం చేస్తుంది.

ఈ సారి ఈ అవార్డుకోసం భారత్ తో పాటు శ్రీలంక, భూటాన్, మలేషియా, నేపాల్, కెన్యా, మాల్దీవులు, మారిషస్ దేశాల నుంచి చేనేత వస్త్రాలను తయారు చేసే వ్యాపారులు, ఆన్ లైన్ విక్రయాలు చేస్తున్నవారు పోటీ పడ్డారు. ఇక్కత్ వస్త్రాలకు ఉత్తమ మార్కెటింగ్ కల్పించినందుకు గాను ఈ ఏడాది యాదాద్రి జిల్లా పోచంపల్లికి చెందిన ఇక్కత్ వరల్డ్ అధినేత గంజి యుగంధర్ కు బెస్ట్ హ్యాండ్లూమ్ అవార్డు లభించింది. తమిళనాడులోని తిరుచిరావలిలో రూలా-ఆసియా సంస్థ నిర్వహించిన బిజినెస్ అవార్డు వేడుకల్లో యుగంధర్ ఈ అవార్డును అందుకున్నారు.


Tags

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×