BigTV English

Actress Suryakantham : టాలీవుడ్ గడసరి.. గయ్యాళి అత్తకు నూరేళ్లు..

Actress Suryakantham : టాలీవుడ్ గడసరి.. గయ్యాళి అత్తకు నూరేళ్లు..

Actress Suryakantham : సినిమా మొత్తం ఒకవైపు ఉంటే.. ఆ ఒక్క పర్సనాలిటీ ఇంకోవైపు ఉండేది. ఆమె తెరపై కనిపిస్తే చాలు.. థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కి కూడా దడ పుట్టాల్సిందే.. గడసరి అత్త అయినా.. గయ్యాళి గంపైనా.. అనర్గళంగా గుక్క తిప్పుకోకుండా మాట్లాడి అవతలి వాళ్ళని పదాలతోనే పచ్చడి చేసే టాలెంట్ ఉన్న ఏకైక వెండితెర నటి సూర్యకాంతం. ఎటువంటి పాత్రకైనా సరే ధీటుగా సరిపోయే పర్సనాలిటీతో సినిమా మొత్తం తానే అయి నడిపించగలిగే హీరోయిన్ కాని హీరోయిన్ సూర్యకాంతం. ద వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ గయ్యాళి అత్త.. అక్టోబర్ 28, 1924లో జన్మించారు. నేడు సూర్యకాంతం శతజయంతి. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ఆమె ఎంత కీలకంగా మారారో తెలుసుకుందాం.


ఒక్కసారి సూర్యకాంతం.. క్యారెక్టర్ లోకి ప్రవేశించింది అంటే ఎదుట ఉన్నది ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే చెవి మెలి పెట్టి తన ఆధిపత్యం చెలాయించాల్సిందే. ఆమె తిడుతున్నా.. కోప్పడుతున్నా.. అందులో కూడా ఒక రకమైన కామెడీ ఉండటం నిజంగా ఒక బ్రహ్మాండమైన టాలెంట్ అనే చెప్పాలి. సూర్యకాంతం .. తన పేరుని ఒక పవర్ ఫుల్ బ్రాండ్ గా మార్చి.. ఆడపిల్లకు పెళ్లి చేయాలంటేనే అత్త పోరు ఎలా ఉంటుందో బాబోయ్.. అని తల్లిదండ్రులు ఆలోచించుకునే రేంజ్ లో భయపెట్టేసింది.

ఆమె పేరు వింటే కోడళ్ళ గుండెల్లో గుబులు పుడుతుంది. అల్లుళ్లు పారిపోతారు.. ఇక భర్త అయితే సన్యాసం పుచ్చుకోవాల్సిందే. కొంగు బొడ్డులో దోపి అపర కాళిలా డైలాగ్ విసుర్లు విసురుతూ.. అవతలి వాళ్లకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా దులిపేయడం ఒక్క సూర్యకాంతానికే సొంతం. ఇక ఆమె తర్వాత ఎందరో అత్త పాత్రలు పోషించినా.. ఆ గ్లామర్ అయితే లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకప్పటి కుటుంబ కథా చిత్రాలలో అందరూ ఇష్టపడే పవర్ ఫుల్ హారర్ ఎలిమెంట్ సూర్యకాంతం.


ఏది ఎలా ఉన్నా సూర్యకాంతం మూతి విరుపుల దగ్గర నుంచి నిష్టురాల వరకు.. విసుర్ల దగ్గర నుంచి కసుర్ల వరకు చూడడానికి చాలా రంజుగా ఉండేది. ఈ కాలం వాళ్లకు తెలియకపోవచ్చు కానీ ఒకప్పటి వాళ్ళకి సూర్యకాంతం యాక్టింగ్ ఏ రేంజ్ దో బాగా తెలుసు. ఇక ఆమె పక్కన మొగుడిగా నటించిన వాడు నోరెత్తే ఆస్కారమే ఉండదు. అది ఎస్ వీఆర్ అయినా.. రేలంగి అయినా.. రమణారెడ్డి అయినా ఆమె ఛాన్స్ ఇస్తేనే కదా మాట్లాడేది. సంసారం, రక్తసంబంధం, గుండమ్మ కథ.. ఇలా ఆమె నటించిన ఎన్నో మాస్టర్ పీసెస్ ఉన్నాయి.

గయ్యాళితనానికి కూడా ఒక గొప్ప ఇమేజ్ ను సృష్టించడమే కాకుండా అత్త పాత్రకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది సూర్యకాంతం. ఆమె సినిమాల్లో ఎంత నేచురల్ గా నటించేదంటే చూసినవారు మరీ అంత గయ్యాళితనమా.. వామ్మో అని నివ్వరపోయేవారు. ఆమెను థియేటర్లలో చూసి ఏ రేంజ్ లో భయపడ్డారు అంటే .. వాస్తవంగా ఎదుట పడితే ఆటోగ్రాఫ్ అడగాలన్నా భయపడి పోయేవారట. పెళ్లి కాని అమ్మాయిలైతే సూర్యకాంతం నిలబడిన దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా వణికి చచ్చేవారట.

ఆమె హీరో కాదు.. కానీ సినిమా కథ మొత్తం ఆమే నడిపించేది. హీరోయిన్ కాదు.. కానీ జనం ఆమెను చూడడానికి థియేటర్ కి వచ్చేవాళ్ళు. కమెడియన్ కాదు.. ఆమె ఒక్కసారి నవ్వితే చాలు జనం అంత నవ్వేవారు. విలన్ కాదు.. అయినా ఆమె కన్నెర్ర చేస్తే వణికి పోయేవారు. చరిత్రలో గొప్ప నటీనటులను ఎందరినో చూసుంటాం కానీ సూర్యకాంతం మాత్రం డిఫరెంట్. ఒక యాక్టర్ లేని లోటు ఇంకొక యాక్టర్ తీరుస్తాడేమో కానీ సూర్యకాంతం ప్లేస్ ని భర్తీ చేసే మరొక యాక్టర్ టోటల్ ఇండస్ట్రీలోనే ఎవ్వరూ లేరనడంలో సందేహం లేదు. అప్పట్లో సూర్యకాంతం పాత్ర లేని సినిమా అంటే.. ఏదో తెలియని వెలితి కనిపించేది.

Related News

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Big Stories

×