E-Paper
Advertisement

Vettaiyan : నటీనటుల రెమ్యునరేషన్ ఎంతంటే.. ఎవరికి ఎక్కువ అంటే..?

Vettaiyan : నటీనటుల రెమ్యునరేషన్ ఎంతంటే.. ఎవరికి ఎక్కువ అంటే..?

Vettaiyan.. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)తాజాగా నటించిన చిత్రం వేట్టయాన్(Vettaiyan). ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ టిజే జ్ఞానవేల్ (TJ.Gnanavel) దర్శకత్వంలో అక్టోబర్ 10 వ తేదీన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని కలెక్షన్లతో దూసుకుపోతోంది ఈ సినిమా. ఇందులో అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ హీరో రాణా దగ్గుబాటి, మంజు వారియర్ , ఫహాద్ ఫాజిల్, అభిరామి, రితికా సింగ్, కిషోర్, దుషారా విజయ్ , రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా.. ఈ సంగీతం సినిమాకు ప్లస్ గా మారింది. దాదాపు 30 యేళ్ళ తర్వాత రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ ఇద్దరూ కలిసి నటించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందులో భాగంగానే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది ఈ సినిమా.

తక్కువ సమయంలోనే భారీ కలెక్షన్స్..

ఇకపోతే రూ .300కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.148 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది . ఇకపోతే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన నేపథ్యంలో ఎవరి పారితోషకం ఎంత అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు హీరో మినహా ఎవరు ఎక్కువ పారితోషకం తీసుకున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం. మరి రజినీకాంత్ వేట్టయాన్ చిత్రానికి ఎవరి పారితోషికం ఎంతో ఇప్పుడు చూద్దాం.

అమితాబ్ కంటే 17 రెట్లు ఎక్కువ పారితోషకం..

ఈ సినిమా కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ఏకంగా రూ.125 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. అమితాబ్ బచ్చన్ కేవలం రూ.7 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమితాబ్ బచ్చన్ కంటే రజనీకాంత్ 17 రెట్లు ఎక్కువ పారితోషికం తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇద్దరూ సూపర్ స్టార్స్ అయినప్పటికీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు కానీ పారితోషకంలో ఇంత వ్యత్యాసం ఏమిటి అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

స్టార్ క్యాస్ట్ రెమ్యూనరేషన్..

సపోర్టింగ్ క్యారెక్టర్ లో నటిస్తున్న నటీనటుల రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. వేట్టయాన్ సినిమాలో చాలామంది స్టార్స్ సపోర్టింగ్ రోల్స్ పోషించారు. మలయాళం స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ సినిమా కోసం రూ .3కోట్లు తీసుకోగా, మంజు వారియర్ రూ.2.5 కోట్లు, రానా రూ.5 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో తనదైన స్టైల్ లో దుమ్ము దులిపేసిన రితిక సింగ్ మాత్రం కేవలం రూ.35 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇందులో కీలక పాత్ర లో రానా నటించినప్పటికీ ప్రేక్షకులు ఆ పాత్రను జర్నించుకోలేకపోతున్నారు. బాహుబలి సినిమాలో భల్లాలదేవ క్యారెక్టర్ లో నటించిన రానాకు ఇప్పుడు ఎటువంటి గుర్తింపు లేని పాత్ర ఇవ్వడంతో అభిమానులు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పాత్రలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.. ఏది ఏమైనా రానా ఇందులో నటించినప్పటికీ గుర్తింపు లేకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×