BigTV English

Victory Venkatesh : సెంటిమెంట్ ఫాలో అవుతున్న వెంకీ డైరెక్ట‌ర్‌

Victory Venkatesh : సెంటిమెంట్ ఫాలో అవుతున్న వెంకీ డైరెక్ట‌ర్‌


Victory Venkatesh

Victory Venkatesh : సినిమా ఇండ‌స్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ఒక్కొక్క‌రికీ ఒక్కో విష‌యంలో సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఓ యంగ్ డైరెక్ట‌ర్ ఇలాంటి సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్నాడు మ‌రి. ఇంత‌కీ స‌ద‌రు ద‌ర్శ‌కుడు ఏ విష‌యంలో సెంటిమెంట్ ఫాలో అవుతున్నారో తెలుసా!.. రిలీజ్ డేట్ మేట‌ర్‌లో. ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు శైలేష్ కొల‌ను. ఈ యువ ద‌ర్శ‌కుడు హిట్ యూనివ‌ర్స్‌తో హిట్స్ సాధించిన సంగ‌తి తెలిసిందే. హిట్, హిట్ 2 రెండు సినిమాలు డిసెంబ‌ర్‌లోనే రిలీజ్ అయ్యాయి. హిట్ 3 ట్రాక్ ఎక్కుతుంద‌ని అంద‌రూ భావించారు. అయితే అనుకోకుండా వెంకీ మామ లైన్‌లోకి వ‌చ్చేశాడు.

ఇప్పుడు విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో సైంధ‌వ్ అనే సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 23 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. చాలా రోజుల త‌ర్వాత వెంక‌టేష్ ఇన్‌టెన్స్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్స్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. తాజాగా సైంధ‌వ్ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ తెలియ‌జేశారు. ఎప్ప‌టిలాగానే శైలేష్ త‌న‌కు క‌లిసి వ‌చ్చిన డిసెంబ‌ర్ నెల‌లోనే సైంధ‌వ్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఆ మేర‌కు డిసెంబ‌ర్ 22న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్లు ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.


వెంక‌టేష్ హీరోగా న‌టిస్తోన్న తొలి పాన్ ఇండియా మూవీ సైంధ‌వ్‌. విల‌న్‌గా బాలీవుడ్ యాక్ట‌ర్ న‌వాజుద్దీన్ సిద్ధిఖీ న‌టిస్తున్నారు. ముగ్గురు హీరోయిన్స్ క‌నిపించ‌బోతున్నారు. మెడికల్ రంగంలోని మాఫియా బ్యాక్ డ్రాప్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇప్ప‌టికే రుహానీ శ‌ర్మ‌, శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా ఓకే అయ్యార‌ని టాక్‌. మూడో హీరోయిన్ విష‌యంలో త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. సంతోష్ నారాయ‌ణ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×