BigTV English

Vidaamuyarchi: సంక్రాంతి బరి నుంచి అజిత్ మూవీ తప్పుకోవడం వెనుక అతని హస్తం ఉందా..?

Vidaamuyarchi: సంక్రాంతి బరి నుంచి అజిత్ మూవీ తప్పుకోవడం వెనుక అతని హస్తం ఉందా..?

Vidaamuyarchi: సంక్రాంతి రేస్ లో సినిమాలు రిలీజ్ అవ్వడానికి తెగ పోటీ పడుతున్నాయి. ఎందుకంటే ఈ సంక్రాంతి రేసులో యావరేజ్ టాక్ వచ్చినా సరే కలెక్షన్లు భారీగా వస్తాయనే ఆశతో నిర్మాతలు ఈ సంక్రాంతిని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక అన్ని రకాలుగా లాభాలు పొందాలని ప్రయత్నించే.. కొంతమంది నిర్మాతలు అనుకోని కారణాల చేత వెనక్కి తగ్గాల్సి వస్తూ ఉంటుంది. అలా ఒక సినిమా కోసం ఇంకొక సినిమా వెనక్కి తగిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక ఇప్పుడు సంక్రాంతి బరిలో మూడు తెలుగు సినిమాలతో పాటు ఒక తమిళ్ మూవీ కూడా పోటీకి దిగబోతోంది అంటూ వార్తలు రాగా.. లాస్ట్ మినిట్ లో లైకా ప్రొడక్షన్స్ అజిత్ మూవీని సంక్రాంతి బరి నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటన చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ సిద్ధమైన తర్వాత సడన్గా ఇలా వాయిదా పడడం ఏంటి? అంటూ అభిమానులు సైతం ప్రశ్నిస్తున్న నేపథ్యంలో తాజాగా మరో కీలకమైన విషయం తెరపైకి వచ్చింది.


రామ్ చరణ్ మూవీ కోసం తప్పుకున్న అజిత్ మూవీ..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ప్రముఖ డైరెక్టర్ శంకర్ (Shankar) తాజాగా రామ్ చరణ్(Ram Charan) తో గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 10వ తేదీన విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతోంది. కానీ తమిళ్ ఇండస్ట్రీలో మాత్రం అనుకున్నంత స్థాయిలో హైపు క్రియేట్ అవలేదు. దీనికి తోడు ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాను కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ఇక పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్న ఈ సినిమాకి కలెక్షన్లు రాకపోతే డైరెక్టర్ గా తన కెరీర్ కు ఆటంకం కలుగుతుంది అని భావించిన శంకర్, అజిత్(Ajith ) విడాముయార్చి’ మూవీని వెనక్కి తగ్గేలా చేసినట్లు తెలుస్తోంది.


శంకర్ వల్లే వెనక్కి తగ్గిన నిర్మాతలు..

అసలు విషయంలోకి వెళ్తే.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అజిత్ హీరోగా విడాముయార్చి సినిమా సంక్రాంతికి విడుదలవుతోందని తెలియజేశారు. కానీ సడన్గా లైకా ప్రొడక్షన్స్ వాయిదా వేసింది. దీని వెనుక పెద్ద కథే నడిపించారట స్టార్ డైరెక్టర్ శంకర్. ఈయన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఒత్తిడి తీసుకురావడంతోనే ఈ సినిమాని లాస్ట్ మినిట్ లో సంక్రాంతి పోటీ నుంచీ తప్పించినట్లు సమాచారం. డైరెక్టర్ శంకర్ లైకా ప్రొడక్షన్ కాంబినేషన్లో ఇండియన్ -2 సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ గా నిలిచింది. అయినా సరే లైకా తో ఇండియన్ 3 సినిమా కూడా చేస్తున్నారు శంకర్. అయితే ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ను విడుదల చేసి సక్సెస్ కొట్టాలనుకుంటున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్లో కూడా గేమ్ ఛేంజర్ రిలీజ్ చేస్తున్నారు. కానీ అజిత్ సినిమాకి ఉన్న క్రేజ్ తమిళంలో గేమ్ ఛేంజర్ కి లేదు. ఇక మరొకవైపు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కూడా విడాముయార్చి తీసుకోవాలని అనుకున్నారు. దీంతో గేమ్ ఛేంజర్ కు విడాముయార్చి అడ్డు లేకపోతే ఇండియన్ -3 ని చాలా ఫాస్ట్ గా పూర్తి చేస్తానని, గేమ్ ఛేంజర్ తో మళ్ళీ ఫామ్ లోకి వస్తే, అది ఇండియన్ -3 కి ప్లస్ అవుతుంది అని కూడా లైకా ప్రొడక్షన్స్ తో చెప్పి శంకర్ ఒప్పించినట్లు తెలుస్తోంది. అందుకే సడన్గా చివరి నిమిషంలో అజిత్ మూవీని సంక్రాంతి బరి నుంచి తప్పించారు. మొత్తానికి అయితే రామ్ చరణ్ సినిమా కోసం అజిత్ మూవీని తప్పించారు. మరి తమిళ్లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×