Case Filed on Madhavilatha: సినీ సెలబ్రెటీలు కూడా ఈ మధ్యకాలం పొలిటికల్లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇలాంటి వారిలో మాధవిలత ఒకరు. అయితే ఈమె ఎక్కువగా ఏదొక విషయంలో వివాదాలలో నిలుస్తూనే ఉంటుంది. ఎలాంటి సంఘటన జరిగిన సరే వాటిపై రియాక్ట్ అవుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా బీజేపీ పార్టీలో ఉండటం వల్ల, మాధవిలత అన్ని విషయాలపై రియాక్ట్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా న్యూయర్ రోజు సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. అదేంటంటే.. తాడిపత్రిలోని మహిళలకు సూచిస్తూ.. జేసీ పార్కుకు వెళ్లొద్దని.. అక్కడ ఆడవాళ్లకు సేఫ్టీ లేదని తెలిపిందట. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పెన్నా నది ఒడ్డున జెసి పార్కు వద్ద గంజాయి, డ్రగ్స్ బ్యాచ్‌లు ఉంటాయని ఆమె ఆరోపించారు. న్యూయర్ రోజు సాయంత్రం ఒంటిగంట సమయంలో సంబరాలు చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళే క్రమంలో.. వెహికిల్స్‌తో చాలా ఇబ్బంది పడతారని, మద్యం మత్తులో వాళ్లు ఏమైనా చొయ్యొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు సేఫ్టీ ఏరియాలోనూ, కమ్యూనిటీ హాల్లోను న్యూయర్ సెలబ్రేషన్ చేసుకున్న తప్పు పట్టేదాన్ని కాదంటూ వీడియోలో తెలిపారు. మాధవీలత వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కొత్త సంవత్సరం రోజు పట్టణ మహిళలకు అవమానం జరిగేలా మాట్లాడారని ఫైర్ అయ్యారు. జెసి పార్కు సేఫ్టీ కాదని, అక్కడ గంజాయి తాగుతారు అంటూ ఆమెతో కావలనే తప్పుడు ప్రచారం చేయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్కడితే కథ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ, అక్కడే అసలు కథ మొదలైంది. జనవరి 2 తెల్లవారుజామున జేసీ బస్సులు దగ్ధం అయ్యాయి. అందులో రెండు బస్సుల కాలిపోయాయి. మొదట అంతా షార్ట్ సర్క్యూట్ కారణం ఈ ప్రమాదం జరిగిందని అంతా అనుకున్నారు. కానీ.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలే తన బస్సులు తగలబెట్టారని అనుమానం వ్యక్తం చేశారు. కానీ.. తాను కంప్లైంట్ చేయనని.. చేతనైనతే పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేయాలని జేసీ ప్రభాకర్ తనదైన శైలిలో సవాల్ చేశారు.
Also Read: ఉత్కంఠ వీడేనా.? బన్నీకి పూర్తిస్థాయి బెయిల్‌పై నేడే తీర్పు
జగన్ కేవలం తమ బస్సులు సీజ్ చేపించారు.. మీరు మాత్రం తమ బస్సులను తగలబెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తాను వెనక్కి తగ్గను అంటున్న జేసి.. ఈ రచ్చ ఎక్కడికి దారితీస్తుందో అంటూ అనంత రాజకీయ వర్గాల్లో చర్చ, రచ్చ మొదలైంది. ఇదిలా ఉంటే.. సినీ నటి బీజేపీ నాయకురాలు మాధవి లతపై తాడిపత్రి పోలిస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎస్సీ మాల కార్పోరేషన్ డైరక్టర్ కుంకరి కమలమ్మతో పాటు, టీడీపీ మహిళా కౌన్సిల్ కంప్లైంట్ చేశారు. తాడిపత్రి ప్రాంత మహిళలపై మాధవిలత అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని, మాధవిలతను కఠినంగా శిక్షించాలను వారు కోరారు.

Share