Vidhyabalan: బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ (Vidhyabalan) ‘ది డర్టీ పిక్చర్స్’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ముఖ్యంగా ఈమె కెరియర్ పై ఈ సినిమా ఎలాంటి ముద్ర వేసింది అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రధమంగా ఈ సినిమా పేరే వినిపిస్తుంది. సిల్క్ స్మిత బయోపిక్ ఆధారంగా వచ్చిన ఈ సినిమా విద్యాబాలన్ కెరియర్ కు పునాదులు వేసిందని చెప్పవచ్చు. విద్యాబాలన్ ఓపెన్ మైండెడ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ పై ఎంతో ఓపెన్ గా మాట్లాడింది. అవకాశం పేరుతో లైంగికంగా ఎలాంటి వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే విషయాన్ని కూడా అందరికీ తెలియజేసింది. లైంగిక వేధింపుల నుంచి తాను ఎలా తప్పించుకున్నానో కూడా చెప్పుకొచ్చింది. ఇక ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే యువతకు తాను సూచించేది ఇదే అంటూ గతంలో పలు విషయాలు పంచుకున్న ఈమె.. ఇప్పుడు మళ్లీ క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది.
నిర్మాత వల్ల ఆరు నెలలు నరకం చూసా -విద్యాబాలన్
సినీ ఇండస్ట్రీలో తాను పడ్డ అవమానాల గురించి చెప్పుకొచ్చింది. విద్యా బాలన్ మాట్లాడుతూ.. “ఒక సినీ నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు. నా దగ్గరికి నేరుగా వచ్చి అసభ్యంగా పిలిచాడు. ఆ అవమానం తర్వాత నా ముఖాన్ని నేను అద్దంలో ఆరు నెలల పాటు చూసుకోలేదు. ఆ మాటలు నాపై ఎంత ప్రభావాన్ని చూపాయంటే.. ఆ ఆరు నెలలు నరకం అనుభవించాను. నాపై నేనే నమ్మకం కోల్పోయాను. ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగాయి.. అదే సమయంలో బాడీ షేమింగ్ కూడా చేశారు”. అంటూ తెలిపింది.
సినిమా ఆగిపోతే దురదృష్టవంతురాలన్నారు – విద్యాబాలన్
ఇంకా మాట్లాడుతూ.. “మలయాళంలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ప్రారంభానికి ముందే ఆగిపోతే.. అప్పుడు నన్ను అందరూ దురదృష్టవంతురాలు అని కూడా అన్నారు. ఆ సినిమా ఏదో కారణాలు చేత ఆగిపోతే నా వల్లే నిలిచిపోయిందని ప్రచారం చేశారు. ఇలాంటివి నా జీవితంలో ఎన్నో ఉన్నాయి” అని చెప్పుకొచ్చింది విద్యాబాలన్. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ప్రత్యేకించి బాలీవుడ్ పై ఇలాంటి కామెంట్లు ఎన్నో చేశారు. ముఖ్యంగా ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) ను మొదలుకొని దీపికా పదుకొనే (Deepika Padukone) వరకు చాలామంది తమ అనుభవాలను పంచుకున్నారు. ఇక కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చేవారికి కూడా ఎన్నో సలహాలు ఇచ్చారు ఈ సీనియర్ బ్యూటీలు. ఇక ఇలా విద్యాబాలన్ కూడా ఇప్పుడు తనవంతుగా ముందుకొచ్చి ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి.. ఒకవేళ సమస్యలు ఎదురయితే.. మనకు మనం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అని కూడా విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. ఈమె సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం. గత ఏడాది రెండు సినిమాలతో అలరించిన ఈమె ఇప్పుడు మరో ప్రాజెక్టు అనౌన్స్ చేయకపోవడం పై కూడా అభిమానులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మరో మంచి ప్రాజెక్టుతో అభిమానుల ముందుకు వస్తుందేమో చూడాలి.