BigTV English

AP Politics: బాబుపై కేశినేని పోస్ట్.. ఆ విషయాన్ని అంగీకరిస్తున్నా అంటూ..

AP Politics: బాబుపై కేశినేని పోస్ట్.. ఆ విషయాన్ని అంగీకరిస్తున్నా అంటూ..

AP Politics: ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం శుభాకాంక్షలు తెలియజేయడం ఆసక్తి రేపుతోంది. సీబీఎన్ వజ్రోత్సవ జన్మదినం సందర్భంగా ఊహించని రీతిలో అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధాని మోడీ దగ్గర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష నేతలు చంద్రబాబుకి విషెష్ చెప్పడం తెలుగు తమ్ముళ్లను ఆనందంలో ముంచి తేలుస్తోంది. అదే సమయంలో టీడీపీతో విభేదించి వైసీపీ బాట పట్టి, అంతలోనే రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ కేశినేని నాని ఆయన్ని ఆకాశానికెత్తుతూ ప్రశంసించడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.


చంద్రబాబుకి విషెస్ చెప్పిన ఊహించని ప్రత్యర్థులు

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా ఊహించని ప్రత్యర్థులు విషెస్ చెప్పడం ఆసక్తి రేపుతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ దగ్గర నుంచి ఏపీ మాజీ సీఎం జగన్ సహా పలువురు చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని వైసీపీ అధినేత జగన్ ఆకాంక్షించారు. అటు తెలంగాణ నుంచి మాజీ మంత్రి కేటీఆర్ సైతం చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాదు, చంద్రబాబు హయాంలో హైదరాబాద్ కి ఐటీ కంపెనీలు వచ్చాయని, హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర ఉందన్నారు. కేసీఆర్, షర్మిల సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలపడం విశేషం. పార్టీ నేతలు, మిత్రపక్షాలు, అభిమానులు సరేసరి.. వైరి వర్గాలు కూడా ఈసారి చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలపడం ఆసక్తిగా మారింది.


తల్లి విజయమ్మకు శుభాకాంక్షలు తెలపని జగన్

మాజీ సీఎం జగన్ తన తల్లి విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈసారి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలపలేదు. ఈ ఏడాది మాత్రం ఆయన చెప్పలేదు. తల్లి పుట్టినరోజుని పట్టించుకోని జగన్, తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారని ఎవరూ అనుకోలేదు. కానీ విచిత్రంగా ఆయన చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ వేశారు. ఆయన ప్రశాంతమైన, ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఇదే జగన్ గతంలో చంద్రబాబుకి వయస్సు అయిపోయిందని, రాష్ట్రానికి తానే దిక్కని తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు అభినందిస్తూ .. ఆయన కనీసం ట్వీట్ కూడా చేయకపోవడం తీవ్ర విమర్శల పాలైంది.

సీబీఎస్ అరెస్ట్ సమయంలో నిరసనలకు అనుమతివ్వని కేటీఆర్

వైసీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయితే కనీసం హైదరాబాద్ లో నిరసనలకు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులివ్వలేదు. పక్క రాష్ట్రం వ్యవహారాలు ఇక్కడెందుకంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైటెక్‌ సిటీలో జరుగుతున్న నిరసనల్ని అడ్డుకున్న కల్వకుంట్ల వారసుడు చంద్రబాబుపై అక్కసుని ప్రదర్శించారు. అయితే ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ తన సహజ వైఖరికి భిన్నంగా స్పందించడం విశేషం. ట్విట్టర్లో విషెస్ చెబుతూనే.. పార్టీ మీటింగ్ లో చంద్రబాబు గొప్పదనాన్ని మెచ్చుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర ఉందన్నారు. హైదరాబాద్ కి ఐటీ కంపెనీలు చంద్రబాబు తీసుకొచ్చారని వివరించారు. అభివృద్ధి విషయంలో ఎవరి ఆనవాళ్లు, ఇంకెవరూ చెరిపేయలేరని చెప్పుకొచ్చారు.

సీబీఎన్‌కు విషెష్‌తో హోరెత్తిపోయిన సోషల్‌మీడియా

అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని, ఆయన పాలనలో ఏపీ ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు కేసీఆర్. మొత్తానికి ప్రధాని మోడీ నుంచి మొదలు పెడితే చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా హోరెత్తిపోయింది. నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి పుట్టినరోజు కావడంతో పార్టీల కతీతంగా నేతలంతా సామాజిక మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన వారంతా శుభాకాంక్షలు చెబుతూ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించడం విశేషం.

హాట్ టాపిక్‌గా మారిన కేశినేని నాని ట్వీట్

విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబును కీర్తిస్తూ విషెస్ చెప్పడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఒకప్పుడు టీడీపీ తరఫున రెండుసార్లు విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలిచిన కేశినేని నాని పార్టీకి వీరవిధేయుడిగా ఉండేవారు. గత ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అక్కడ ఎంపీ సీటు తెచ్చుకున్నా, ఓడిపోయారు. దీంతో రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయినా సోషల్ మీడియాలో నాని యాక్టివ్ గానే ఉంటున్నారు.

టీడీపీలోకి కేశినేని నాని రీఎంట్రీకి ప్రయత్నిస్తున్నారని ప్రచారం

ఆ క్రమంలో ఇవాళ సీఎం చంద్రబాబును ఉద్దేశించి కేశినేని నాని ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో చంద్రబాబుకు వజ్రోత్సవ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో చంద్రబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తుచేశారు. ఈ మైలురాయి ప్రజా జీవితంలో సుదీర్ఘ ప్రయాణాన్ని, దశాబ్దాల రాజకీయ నాయకత్వం, పాలన, ప్రజా సేవను సూచిస్తుందని నాని తెలిపారు. ఒక నిర్దిష్ట దశలో ఆ ప్రయాణంలో భాగం అయ్యే అవకాశం తనకు లభించిందన్నారు. ఆ అనుభవాన్ని తాను అంగీకరిస్తున్నట్లు కూడా నాని తెలిపారు. మీకు మంచి ఆరోగ్యం, నిరంతర బలం, ప్రజా జీవితంలో, సేవలో మరిన్ని చురుకైన సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్తూ కేశినేని నాని తన పోస్టును ముగించారు.

Also read: అల్లుడు వచ్చాడు.! మనకు జరిగే లాభాలు ఏంటంటే

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×