Intinti Ramayanam Today Episode April 22nd : నిన్నటి ఎపిసోడ్ లో.. తనను మోసం చేసి ఆ వ్యక్తి విదేశాలకు పారిపోయాడు. ఇక తిరిగిరాడని తెలిస్తే ప్రణతి ఏమవుతుందో ఊహించలేము అని అంటుంది. ఆ మాటలు విన్న ప్రణతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నావల్ల వదినా చాలా కష్టాలు పడుతుంది. నేను చచ్చిపోతే వదినకు కష్టాలు తీరిపోతాయని ప్రణతి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. అవని ఇంట్లో వాళ్ళందరికీ భోజనం వడ్డించి ఇంకా ప్రణతి రాలేదు భరత్ ని తీసుకు రమ్మని చెప్తుంది. లోపలికి వెళ్లి చూస్తే ప్రణతి గదిలో ఉండదు. మనం మాట్లాడుకున్న మాటలు ప్రణతి వినిందా ఏంటి? ఇకనుంచి వెళ్ళిపోయింది పదం వెళ్లి వెతుకుదామని వెతడానికి వెళ్తారు. ప్రణతి నీ వెతుక్కుంటూ అవని భరత్ వెళ్తూ ఉంటే అక్కడ ప్రణతి కింద పడిపోయి ఉంటుంది. అంబులెన్స్ కి ఫోన్ చేసి ప్రణతిని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళగానే ప్రణతికి స్పృహ వచ్చేసి నొప్పిగా ఉందని బాధపడుతూ ఉంటుంది. ప్రణతికి అబార్షన్ అవుతుంది. అవని ప్రణతిని ఓదారుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే..అక్షయ్ ఆరాధ్య నువ్వు రెడీ చేసి స్కూల్ కి తీసుకెళ్లాలనుకుంటాడు. కానీ పల్లవి నేను నీకోసం క్యారేజ్ తెచ్చాను అంటే ఆరాధ్య నాకు అవసరం లేదంటుంది. కానీ పల్లవి మాత్రం ఆరాధ్య అలానే అంటుంది మీరు తీసుకెళ్లండి బావగారు అని అంటుంది. ఇక ఆరాధ్యడు నేను స్కూలుకు తీసుకెళ్తానని పల్లవి అడుగుతుంది కానీ నేనే స్కూల్ కి తీసుకెళ్తానని అక్షయ్ అంటాడు. పల్లవి అవని నుంచి ఆరాధ్యను తన వైపు తిప్పుకుంటే అవని ఇంట్లో అడుగుపెట్టదు అని అనుకుంటుంది. పార్వతి ఆరాధ్య అవని కోసం ఇంకా బాధపడుతుంది ఎలాగైనా నా మనవరాలుని నేను దక్కించుకోవాలని అనుకుంటుంది. దానికి పల్లవి మీరేం కంగారు పడకండి అత్తయ్య ఆరాధ్యను ఆవని తీసుకుపోకుండా నేను చూసుకుంటాను అని అంటుంది.
రాజేంద్రప్రసాద్ చెక్ అప్ కోసమని హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ డాక్టర్ దగ్గర రిపోర్ట్స్ చూపించి చెక్ చేయించుకొని వెళ్తూ ఉంటే భరత్ ఆపి మీ అమ్మాయి ప్రణతి హాస్పిటల్లో ఉంది అని అంటాడు. భరత్ ని చూడగానే కోపంతో రగిలిపోయిన రాజేంద్రప్రసాద్ అతను చెప్పే మాటల్ని అస్సలు పట్టించుకోడు. నిన్ను చూస్తుంటేనే నాకు చిరాకులేస్తుంది ఒళ్లంతా కోపంగా రగిలిపోతుంది అని రాజేంద్రప్రసాద్ అంటాడు. అక్కడే ఉన్న నర్సు మీరు ఆవేశపడద్దని డాక్టర్ చెప్పారు. అలా చేస్తే మీకు బిపి పెరుగుతుంది సార్. మీరు ముందు బిపి చెక్ చేయించుకోవాలి రండి అని తీసుకెళ్తుంది.
రాజేంద్రప్రసాద్ అన్ని రిపోర్ట్స్ తీసుకొని బయటికి వెళ్తున్న సమయంలో ఒక గదిలో ప్రణతి పడుకొని ఉండడం చూస్తాడు. ప్రణతి ఆ స్థితిలో చూసి ఎమోషనల్ అవుతాడు. అక్కడే ఉన్న భరత్ ని ప్రణితికి ఏమైందని అడుగుతాడు. చిన్న యాక్సిడెంట్ వల్ల ప్రణతి కడుపుకి బలంగా గాయమైంది దాంతో అబార్షన్ చేయాల్సి వచ్చింది అని భరత్ చెప్తాడు. అది విన్న రాజేంద్రప్రసాద్ లోపల ప్రణతిని పరామర్శించేందుకు వెళ్తాడు.
పడుకుని ఉన్న ప్రణతిని లేపి ఏమైందని అడుగుతాడు. నేను చేసిన పాపం నా బిడ్డకు శాపం అయ్యి నా బిడ్డ చనిపోయింది నాన్న అని ప్రణతి బాధపడుతుంది. అసలేం జరిగిందమ్మా అని ప్రణతిని అడుగుతాడు రాజేంద్రప్రసాద్. నేను ప్రశాంత్ అనే ఒక వ్యక్తిని ప్రేమించాను నాన్న వాడు నన్ను మోసం చేసి పారిపోయాడు. వాడి వల్ల నేను గర్భవతి అయ్యాను. భరత్ కి ఎటువంటి సంబంధం లేదు. నా ప్రాణాలను కాపాడేందుకు అవని వదిన భరత్ కి నాకు దండలు వేసింది మా ఇద్దరికీ పెళ్లి కాలేదు అని అసలు నిజం రాజేంద్రప్రసాద్ తో ప్రణతి చెప్తుంది.
ఈ విషయాన్ని మాకెందుకు చెప్పలేదు అని రాజేంద్రప్రసాద్ అడిగితే.. మీకు చెప్పడానికి వస్తే.. అవని వదిన ప్లాన్ చేసి మరి నా చేత ఇలా చెప్పిస్తుందని అందరూ అన్నారు. అవని వదిన భరత్ చాలా మంచి వాళ్ళు నన్ను ప్రాణాలతో కాపాడడానికే ఈ నాటకం ఆడించారు అని ప్రణతి జరిగిన మొత్తం విషయాన్ని వాళ్ళ నాన్నతో చెప్తుంది. అప్పుడే నర్స్ అక్కడికి వచ్చి ఆమెకు రాత్రి ఆపరేషన్ అయింది.. మీరు ఆమెను ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి ఇబ్బంది పడుతుందని అనగానే రాజేంద్రప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక అవని ప్రణతి హాస్పిటల్ బిల్లు కట్టడానికి ఇంకో 50,000 కావాలి స్కూల్లో అడ్వాన్స్ అడిగితే ఇవ్వట్లేదు. ఆయన వస్తాడు కదా ఆయన అడిగి తన చెల్లెలు పరిస్థితి ఇది అని చెప్తే డబ్బులు ఇస్తాడు అని అక్షయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అక్షయ్ ఆరాధ్యను తీసుకొని వస్తాడు. అవని ఇచ్చిన లంచ్ బాక్స్ ని నువ్వు తినొద్దు మీ పిన్ని నీ కోసం టమోటా రైస్ చిప్స్ పెట్టింది నువ్వు అదే తినాలి అని ఆరాధ్యకు చెప్పి అక్షయ్ ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉంటాడు. ఆయన్ని ఎలాగైనా డబ్బులు అడగాలని అవని వెయిట్ చేస్తూ ఉంటుంది. అవని అడగబోతుంటే నీతో మాట్లాడడమే నాకు ఇష్టం లేదని అక్షయ్ అంటాడు. అప్పుడే ఒక దొంగ అక్కడికి వచ్చి అక్షయ చేతుల్లో ఉన్న బ్రీఫ్ కేస్ ని లాక్కొని పారిపోతాడు. అవని శివంగిలాగా మరి ఆ దొంగని కర్రతో కొట్టి బ్రీఫ్ కేస్ ని అక్షయ్కిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో అవని అడిగిమరీ డబ్బులు తీసుకున్న విషయాన్ని ఇంట్లో అందరికి చెప్తాడు అక్షయ్.. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..