ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi), సూరి(Soori), మంజు వారియర్(Manju warrior) తదితరులు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం విడుదల పార్ట్ 1(Viduthalai part 1). ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో వచ్చే ప్రతి సన్నివేశం కూడా ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా డిసెంబర్ 20వ తేదీన విడుదల పార్ట్ 2(Viduthalai part 2) ను రిలీజ్ చేశారు. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ విడుదల పార్ట్ 1 కంటే కూడా కలెక్షన్లు ఎక్కువగానే రాబట్టింది అని చెప్పవచ్చు.
3 డేస్ కలెక్షన్స్..
మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను పక్కన పెట్టేసారని తెలుస్తోంది. అందుకే ఒక్క తమిళ్లో రూ.6.6 కోట్లు మొదటి రోజు వస్తే.. తెలుగులో కేవలం రూ.40 లక్షలు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. ఇకపోతే మొదటి రోజు రూ.7 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. రెండు రోజుల్లో రూ.15.2 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక మూడవరోజు విషయానికి వస్తే.. మూడవరోజు కూడా రూ.7.60 కోట్లు కలెక్షన్ రాబట్టినట్లు సమాచారం. ఇక మొత్తం మూడు రోజుల్లో రూ.22.80 కోట్లు రాబట్టింది ఈ సినిమా..
థియేటర్ ఆక్యుపెన్సీ ..
ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. విడుదల పార్ట్ 2 ఆదివారం రోజు తమిళ్ ఇండస్ట్రీలో 39.38 థియేటర్ ఆక్యుపెన్సీను కలిగి ఉంది. మార్నింగ్ షోలు 25.95% ఉండగా, మధ్యాహ్నం షోలకు 44.50% అలాగే సాయంత్రం షోలకి 48.48% ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అయ్యాయి. అయితే ఈ సినిమాకి తెలుగు ఇండస్ట్రీలో మాత్రం పెద్దగా ఆదరణ లభించలేదని చెప్పవచ్చు.
విడుదల పార్ట్ 2 సినిమా కథ..
ఉద్యమ బాట నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మనిషి పుట్టేటప్పుడే ఒకడు పైన, ఒకడు కింద ఇంకొకడు అంతకంటే కింద అని వేరు చేసే ఏర్పాటు వాదులపై తిరగబడ్డ ఉద్యమ కాగడాగా విజయ్ సేతుపతిని చూపించారు. ఇందులో విజయ్ సేతుపతి పెరుమాళ్ అనే క్యారెక్టర్ లో నటించారు. అణగారిన వర్గాల కోసం అడవి బాట పట్టిన పెరుమాళ్ ఎలా పోరాటం చేశారు? అనేది ఈ సినిమా కథ. మొదటి భాగంలో సూరి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఇకపోతే పోలీస్ కస్టడీలో ఉన్న ప్రజాదళం నాయకుడు పెరుమాళ్ విచారణ తోనే అసలు కథ మొదలవుతుంది. పోలీస్ క్యాంప్ లో ఉన్న పెరుమాళ్ ను అడవి మార్గంలో రహస్య ప్రాంతానికి తరలించి, అతడిని ఎన్కౌంటర్ చేయాలని పోలీసులు ఆలోచిస్తారు. ఈ తరుణంలోనే ప్రజాదళం సభ్యులు తమ నాయకుడు పెరుమాళ్ ను పోలీసుల ఉచ్చు నుండి కాపాడే ప్రయత్నం చేయగా.. దీని నుండి వారు పెరుమాళ్ ను తప్పించారా? లేదా? తప్పించకపోతే పెరుమాళ్ ను ఎన్కౌంటర్ చేశారా? లేదా? అసలు స్కూల్ మాస్టర్ గా ఉన్న పెరుమాళ్.. దళానికి ఎలా నాయకుడు అయ్యాడు? అతడు దళం వైపు నడిపించడంలో కిషోర్ ఏ విధంగా ప్రభావం చూపించారు ?అలాగే పెరుమాళ్ జీవితంలోకి మహాలక్ష్మి ఎలా ప్రవేశించింది? పెరుమాళ్ ను పట్టుకున్న కుమరేష్ అలియాస్ సూరి చివరికి ఏమయ్యాడు? అనే విషయాలు తెలియాలంటే పార్ట్ 2 చూడాల్సిందే. అయితే పార్ట్ వన్ ను తెరకెక్కించిన రీతిలో పార్ట్-2 ని ఎస్టాబ్లిష్ చేయడంలో కాస్త ఫెయిల్ అయ్యారు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.