Mohan Babu : టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం ఆయనను మరిన్ని చిక్కుల్లోకి నటిన సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు – మనోజ్ మధ్య జరిగిన గొడవల్లో … మోహన్ బాబు జర్నలిస్ట్ లపై దాడి చేయడంతో ఆయనపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదైంది.. ఆ కేసు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు లో ఫిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అక్కడ విచారణ జరిపిన న్యాయ వ్యవస్థ అతని ఫిటిషన్ ను కొట్టి పడేసింది. అయితే తాజాగా మరోసారి విచారణ జరపగా కోర్టులో బాధితుల తరపు న్యాయవాది అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడంతోనే మోహన్ బాబు జర్నలిస్ట్ హాస్పిటల్ లో కలిశారని వార్తలు వినిపించాయి. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తి కాబట్టి మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని వాదించినట్టుగా తెలుస్తుంది. అనేక వాదనలు విన్న హైకోర్టు సోమవారంకు వాయిదా వేసింది. మరి నేడు తీర్పు మోహన్ బాబుకు వ్యతిరేకంగా వస్తే అరెస్ట్ తప్పదా అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ఏం జరుగుతుందో అనేది ఆసక్తిగా మారింది..
దాడి ఎలా జరిగింది..?
మనోజ్, మోహన్ బాబు మధ్య జరుగుతున్న గొడవలను కవర్ చెయ్యడానికి మీడియా జల్లిపల్లిలోని మోహన్ బాబు ఇంటికి మీడియా వెళ్ళింది. మీడియా సడెన్ గా ఇంటికి రావడంతో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన మోహన్ బాబు జర్నలిస్ట్ ల పై దాడి చేశారు.. ఈ దాడిలో ఒక జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డారు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆయనపై ఈ విషయంలో తీవ్రమైన నెగెటివిటీ రావడంతో అటెంప్ట్ టు మర్డర్ కింద కేసును నమోదు చేశారు పోలీసులు. మొదట తన తప్పేమి లేదని ఆడియో నోట్ పంపిన మోహన్ బాబుకు వ్యతిరేకత పెరగడంతో తగ్గక తప్పలేదు. బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో పాటు ఇటీవలే సదరు జర్నలిస్ట్ ను ఆసుపత్రిలో పరామర్శించారు.. ఇక ఈ కేసు నుంచి బయటపడేందుకు హైకోర్టు లో ఫిటిషన్ వేశారు. ఇక ఆయన ఫిటీషన్ పై విచారణ జరిపిన న్యాయ వ్యవస్థ కొట్టిపడేసింది..
నేడే హైకోర్టు తీర్పు..
హైకోర్టు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరిగింది. సోమవారం వరకు అరెస్టు చేయొద్దంటూ మోహన్ బాబు తరపు న్యాయవాది వాధించారు. అయితే ఏ క్షణమైనా మోహన్ బాబును అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పోలీసులకు కనిపించకుండా తప్పించుకోవడం కోసం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వినిపించాయి. అయితే తనపై నమోదైన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో మోహన్ బాబు ఫిటిషన్ పై నేడు ఫైనల్ తీర్పు రానుందన్న విషయం తెలిసిందే.. ఈరోజు హైకోర్టు ఎలాంటి తీర్పును ఇచ్చినా మోహన్ బాబు తల వంచక తప్పదు. కేసు స్ట్రాంగ్ గా ఉండటంతో బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. అంటే ఈరోజు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే అరెస్ట్ తప్పదా? జైల్లో ఉంచుతార? ఇలాంటి ప్రశ్నలు నెట్టింట వినిపిస్తున్నాయి.. మరి ఏం జరుగుతుంది అనేది కాసేపట్లో తెలియనుంది..