Indian Railway Rules: నిత్యం కోట్లాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. వారిలో కొంత మంది సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటారు. చాలా మంది ట్రైన్ లో ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఉపయోగిస్తారు. కొంత మంది జర్నీలోనే తమ పనులు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తాయి. అయితే, రైళ్లలో మోబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది రాత్రి పూట ఛార్జింగ్ పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, రైళ్లలో రాత్రి 11 గంటల నుంచి ఎట్టి పరిస్థితుల్లో మోబైల్స్, ల్యాప్ టాట్స్ కు ఛార్జింగ్ పెట్టుకోకూడదంటున్నారు నిపుణులు.
Read Also: ఈ ఏడాది ఇన్ని వందేభారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయా? వచ్చే ఏడాది ఇండియన్ రైల్వేలో మరింత జోష్!
ఛార్జింగ్ సాకెట్ల దగ్గర హెచ్చరిక బోర్డు
చాలా రైళ్లలో ఛార్జింగ్ సాకెట్ల దగ్గర హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి. మోబైల్స్, ల్యాప్ టాప్స్ రాత్రి 11 గంటల నుంచి 5 గంటల వరకు ఛార్జింగ్ పెట్టకూడదని అందులో రాసి ఉంటుంది. అయితే, ఎందుకు ఈ సమయంలో ఛార్జింగ్ పెట్టకూడదో చాలా మందికి తెలియదు. కానీ, ఇందుకో బలమైన కారణం ఉందంటున్నారు నిపుణులు. సాధారణంగా ఇళ్లలో ఆల్టర్నేటివ్ కరెంట్ (AC) సరఫరా అవుతుంది. రైళ్లలో డైరెక్ట్ కరెంట్(DC) సరఫరా అవుతుంది. ఒక్కోసారి కరెంట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఒక్కోసారి తక్కువగా వస్తుంది. ఇలా పవర్ సరఫరా కావడం చాలా ప్రమాదకరం. అందుకే రైల్లో ఫోన్లకు ఛార్జింగ్ పెట్టి ఉపయోగిస్తే స్ట్రక్ అవుతుంది. కరెంట్ సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా ఇలా జరుగుతుంది.
Read Also: టికెట్ క్యాన్సిలేషన్ ఇలా చేస్తున్నారా? రీఫండ్ అస్సలు రాదు జాగ్రత్త!
కాసేపు ఛార్జింగ్ పెట్టి తీసేయడం మంచిది!
అస్సలు ఛార్జింగ్ లేని సమయంలోనే రైళ్లలో మోబైల్స్, ల్యాప్ టాప్ లకు ఛార్జింగ్ పెట్టుకోవాలి. అదీ అరగంట వరకు పెట్టుకోవడం ఉత్తమం. కానీ, పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టి అలాగే ఉంచితే, ఒక్కోసారి కరెంట్ బ్యాక్ టు బ్యాక్ ఎక్కువగా వస్తే, ఫోన్ లేదంటే ల్యాప్ టాప్ పేలిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే రైల్లో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంటుంది. ఇండియాలో ఇలాంటి కారణాల వల్లే చాలా రైళ్లలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందుకే భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో రాత్రి పూట ఛార్జింగ్ పెట్టకూడదనే నిబంధనను అమలు చేసింది. ఒకవేళ అత్యవసరం అనుకుంటే 10 నుంచి 20 నిమిషాల వరకు పెట్టుకోవచ్చు సూచించింది. అంతేతప్ప, రాత్రి పూట మొత్తం ఛార్జింగ్ అస్సలు పెట్టుకోకూడదని తేల్చి చెప్పింది. సో, ఒకవేళ మీరు కూడా రైలు ప్రయాణం చేస్తున్నట్లైతే రాత్రి పూట వీలైనంత వరకు మీ ఫోన్లు, ల్యాప్ టాప్ లకు ఛార్జింగ్ పెట్టుకోకపోవడం ఉత్తమం. ఈ విషయాన్ని మీతో పాటు మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.
Read Also: ఆరేళ్ల తర్వాత మళ్లీ పట్టాలెక్కిన గోల్డెన్ చారియట్, అదీ కేవలం 38 మందితో..